Drugs: మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిందే

ABN , First Publish Date - 2022-07-31T13:29:34+05:30 IST

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీఎంకే డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం

Drugs: మాదక ద్రవ్యాలను నిర్మూలించాల్సిందే

                             - కలెక్టరేట్‌ ఎదుట పీఎంకే ధర్నా


చెన్నై, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌ నిర్మూలించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీఎంకే డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. కలెక్టరేట్‌(Collectorate) వద్ద శనివారం ఉదయం  పీఎంకే అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌(Anbumani Ramdas) నేతృత్వంలో నిర్వహించిన ధర్నాలో పార్టీ ప్రముఖులు ఏకే మూర్తి, కేఎన్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నాకు హాజరైన వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తలు మాదకద్రవ్యాలను(Drugs) నిర్మూలించాలంటూ నినాదాలు చేశారు. ధర్నానుద్దేశించి అన్బుమణి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలవకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తనకందిన సమాచారం మేరకు రాష్ట్రంలో 50 లక్షల మంది మాదక ద్రవ్యాలకు బానిసలయ్యారని, నిషేధిత గుట్కా తదితర పొగాకు వస్తువులన్నీ దుకాణాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2022-07-31T13:29:34+05:30 IST