బీహార్‌ ఎన్నికల వేళ..కోసి రైల్ మహాసేతును ప్రారంభించనున్న మోదీ

ABN , First Publish Date - 2020-09-18T12:58:59+05:30 IST

బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కోసి రైల్ మెగా బ్రిడ్జీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు....

బీహార్‌ ఎన్నికల వేళ..కోసి రైల్ మహాసేతును ప్రారంభించనున్న మోదీ

పట్నా(బీహార్): బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో దశాబ్దాలుగా పెండింగులో ఉన్న కోసి రైల్ మెగా బ్రిడ్జీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రారంభించనున్నారు. కూ.516కోట్లతో 1.9కిలోమీటర్ల పొడవున నిర్మించిన చారిత్రాత్మక రైలు వంతెనతో బీహార్ కోసి ప్రాంత ప్రజల 86 ఏళ్ల కల నెరవేరనుంది. ఈ రైలు వంతెన ప్రాజెక్టును 2003-04 లో అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో కీలకమైన ఈ రైలు వంతెన నిర్మాణ పనులను కొవిడ్ సమయంలో వలస కార్మికులతో పూర్తి చేశామని ప్రధాని కార్యాలయం అధికారులు వెల్లడించారు. 


 ఈ వంతెన ప్రారంభం వల్ల రెండు కొత్త రైల్వే లైన్లు, ఐదు ఎలక్ట్రీఫికేషన్ ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్ లోకోమోటివ్ షెడ్ లు చేపట్టనున్నారు.రైలు వంతెన ప్రారంభం అనంతరం ప్రధాని సహస్ర-అసన్ పూర్ కుఫా రైలు సర్వీసుకు మోదీ పచ్చజెండా ఊపుతారు. బీహార్ ఎన్నికల వేళ ప్రధాని మోదీ 16వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టారు. బీహార్ రాష్ట్ర  అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ ఖరారు కానున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వంతెనను ప్రారంభించనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. 




ఈ రైలు వంతెన ప్రారంభంతో బీహార్, తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానం ఏర్పడుతోంది. కోసి నదిపై నిర్మాలీ భాఫటిహిల మధ్య 1887లో చిన్న వంతెన నిర్మించినా 1934లో ఇండో నేపాల్ భూకంపం వల్ల వరదల్లో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి సుధీర్ఘకాలం పాటు కోసి నదిపై రైలు రాకపోకలు లేవు.

Updated Date - 2020-09-18T12:58:59+05:30 IST