Abn logo
Jul 22 2021 @ 21:29PM

Cm Uddhav కు ఫోన్ చేసిన ప్రధాని Modi

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని తప్పకుండా అందిస్తామని సీఎంకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ముంబైతో సహా పలు జిల్లాలను భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. వరుసగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముంబై, థానే, పాల్గర్, కొంకణ్, రత్నగిరి, కొల్హాపూర్ తదితర జిల్లాల్లో రైలు, రోడ్డు సర్వీసులు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వివిధ గ్రామాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.