Modi : చాలా కష్టమైంది... గురుకృప కలిసొచ్చింది

ABN , First Publish Date - 2021-08-29T02:52:54+05:30 IST

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ తర్వాత, అక్కడి నుంచి భారతీయులను తరలించడంలో ఇబ్బందులు తలెత్తాయి

Modi : చాలా కష్టమైంది... గురుకృప కలిసొచ్చింది

న్యూఢిల్లీ : ఆఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ ఆక్రమణ తర్వాత, అక్కడి నుంచి భారతీయులను తరలించడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. అమృత్‌సర్‌‌లోని జలియన్‌వాలా బాగ్ స్మారక పునరుద్ధరణను ప్రారంభించే సందర్భంగా మోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కడైనా, ఏ భారతీయుడైనా ఇబ్బందుల్లో ఉంటే, అతనికి సహాయం చేయడానికి భారత దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. అది కరోనా సమయం కానీ, ఆఫ్గనిస్తాన్ సంక్షోభ విషయంలో కానీ యావత్ జాతి మద్దతుగా నిలిచే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ‘ఆపరేషన్ దేవీ శక్తి’ పేరుతో ఆఫ్గనిస్తాన్‌లో ఉండిపోయిన చాలా మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొస్తున్నామని అన్నారు. ఇలా తీసుకువచ్చే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినా.. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నామని మోదీ వివరించారు. అంతేకాకుండా అక్కడ అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయని, పరిస్థితి కష్టంగా ఉన్నా, గురు కృప బాగా కలిసొచ్చిందని ప్రకటించారు. ఆఫ్గాన్ నుంచి ప్రజలతో పాటు ‘గురుగ్రంథ్ సాహిబ్’ కూడా మోసుకొచ్చామని మోదీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-29T02:52:54+05:30 IST