మేక్ ఇండియా నెంబర్ వన్ మోదీ లక్ష్యం: అమిత్‌షా

ABN , First Publish Date - 2022-04-24T00:58:07+05:30 IST

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ..

మేక్ ఇండియా నెంబర్ వన్ మోదీ లక్ష్యం: అమిత్‌షా

పాట్నా: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్‌ను ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిపేందుకు మోదీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు. 1857 సిపాయిల తిరుగుబాటు హీరో వీర్ కున్వర్ సింగ్ స్మృత్యర్థం శనివారంనాడిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్‌షా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 77,000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఐదు నిమిషాల సేపు ఆపకుండా త్రివర్ణ పతాకాలను ఊపుతూ గత రికార్డులను బద్దలు కొట్టారు. గత రికార్డు పాకిస్థా్‌న్‌లో నమోదైంది. సుమారు 56,000 మంది ప్రజలు తమ జాతీయ జెండాను ఊపుతూ రికార్డు నెలకొల్పారు. తాజాగా ఆ రికార్డు బద్ధలైంది.


ఈ సందర్భంగా, అమిత్‌షా మాట్లాడుతూ, కరోనా మమహ్మారి సమయంలో మోదీ ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో పాటు, పేదలకు ప్రతినెలా ఉచిత రేషన్ సరఫరా చేశారని అన్నారు. ఇదే తరుణంలో బీహార్‌లోని విపక్ష ఆర్జేడీపై ఆయన చురకలు వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఫోస్టర్లను ప్రదర్శించకుండా దూరంగా ఉన్నంత మాత్రన అప్పటి ఆటవిక రాజ్యాన్ని (జంగిల్ రాజ్) జ్ఞాపకాలను ఆ పార్టీ తుడిచివేయలేదని అన్నారు.

Updated Date - 2022-04-24T00:58:07+05:30 IST