Abn logo
Feb 21 2020 @ 21:06PM

అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సూఫీ మత గురువు మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాదర్ పంపారు. ఏటా క్రమం తప్పకుండా ఆయన చాదర్ పంపడం సంప్రదాయంగా పెట్టుకున్నారు. అజ్మీర్ షరీఫ్‌కు చెందిన బృందానికి ఆయన ఈ చాదర్ అందించారు. ఈ నెల 25న దీన్ని మొయినుద్దీన్ చిస్తీ సమాధిపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కప్పుతారు. దేశంలో శాంతి, సౌబ్రాతృత్వం వెల్లివిరియాలంటూ ప్రధాని పంపిన సందేశాన్ని కూడా అక్కడ చదువుతారు. 

Advertisement
Advertisement
Advertisement