Abn logo
Sep 17 2021 @ 22:17PM

ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు

కావల్చిలో కేక్‌ కట్‌ చేస్తున్న బీజేపీ నేతలు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 17: స్థానిక బీజేపీ కార్యాలయంలో శుక్రవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 71 జన్మదిన వేడుకలను బీజేపీ మండల అధ్యక్షుడు గెట్టిబోయిన వెంకటేశ్వర్లయాదవ్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుతున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆవుల రోశయ్య, చల్లా సుబ్బరత్నం, షాజహాన్‌, చెంచయ్య, రాజశేఖర్‌, ఖయ్యూం, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 

కావలిటౌన్‌ : బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు శుక్రవారం రెడ్‌క్రాస్‌ కార్యాలయంలో జరిగాయి. పట్టణ కమిటీ అధ్యక్షుడు బ్రహ్మానంద కేక్‌ ట్‌ చేసి నేతలకు తినిపించారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీవీసీ సత్యం, సుభాషిణీ, మాధవి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.