Abn logo
Jul 31 2021 @ 19:56PM

మోదీకి సొంత కుటుంబంలో చుక్కెదురు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి సొంత కుటుంబంలో చుక్కెదురు అయింది. మోదీకి వ్యతిరేకంగా ఆయన సోదరుడు ఉద్యమం చేస్తున్నారు. జీఎస్టీ కట్టొద్దంటూ ప్రహ్లాద్ మోదీ పిలుపునిచ్చారు. రాణే వ్యాపారుల సదస్సులో ప్రహ్లాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మోదీ కావొచ్చు.. మరొకరు కావొచ్చు... వారు మీ సమస్యలను వినాలి’ అని ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు. జీఎస్టీ చెల్లించబోమంటూ తొలుత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండని సూచించారు. మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామని.. మనమేమీ బానిసలం కాదని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ వ్యాఖ్యానించారు.