వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలి

ABN , First Publish Date - 2022-05-22T04:59:30+05:30 IST

మండలంలోని ఈదగాలిలో శనివారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించాలి
కరపత్రాలను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు

వెంకటాచలం, మే 21 : మండలంలోని ఈదగాలిలో శనివారం సాయంత్రం టీడీపీ ఆధ్వర్యాన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్‌, తెలుగు రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రావూరి రాధాకృష్ణమనాయుడు, నాయకులు ఇంటింటికి తిరిగి వైసీపీ పాలన వైఫల్యాలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెరిగిన ధరలు తగ్గాలన్నా, నిరంకుశ పాలన పోవాలన్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించి చంద్రబాబును సీఎంగా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చల్లా నాగార్జున్‌రెడ్డి, పెనుబల్లి హరిరెడ్డి, దువ్వూరు లక్ష్మమ్మ పాల్గొన్నారు. అలాగే చవటపాళెంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మావిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, కందిమళ్ల సతీష్‌నాయుడు, కోదండయ్యనాయుడు, రమేష్‌నాయుడు, దనుంజ యనాయుడు, మునుస్వామి, పఠాన్‌ ఖాయ్యుమ్‌ ఖాన్‌,  రాజేష్‌, దయాకర్‌, కృష్ణమ్మ, దిలీప్‌, చెన్నకృష్ణయ్య,  రమేష్‌ పాల్గొన్నారు.

ఇందుకూరుపేట : పున్నూరు పంచాయతీలో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం బాదుడే బాదుడే కార్యక్రమం నిర్వహించారు.  నాయకులు పి.చెంచుకిషోర్‌బాబు నాటి చంద్రబాబు పాలనకి నేటి జగన్‌ మోహన్‌రెడ్డి పాలనకు ఉన్న తేడాను ప్రజలకి వివరించారు. కార్యక్రమంలో పున్నూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు సీహెచ్‌.వేణు, ఉపసర్పంచ్‌ సీహెచ్‌.శోభన్‌బాబు, మండల బీసీ సెల్‌ నాయకులు టి.శ్రీనివాసులుగౌడ్‌, బి.వెంకటశేషయ్య, ఎం.కృష్ణా, పి.కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

తోటపల్లిగూడూరు :  మండలంలోని కొత్తపాలెం గ్రామంలో శుక్రవారం బాదుడే బాదుడు కార్యక్రమం జరిగింది. సర్పంచ్‌ చేవూరు పద్మావతి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌తో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి బాదుడే బాదుడు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు, ఉప సర్పంచ్‌ శ్రీనివాసులు, ఉపసర్పంచ్‌ శ్రీహరి, వార్డ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T04:59:30+05:30 IST