సందేశాత్మకంగా నాటిక పోటీలు

ABN , First Publish Date - 2022-07-03T06:45:50+05:30 IST

హేలాపురి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు స్మారక ఆహ్వాన నాటిక పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి.

సందేశాత్మకంగా నాటిక పోటీలు
వ్యవసాయం నాటికలో ఒక దృశ్యం

ఏలూరు కల్చరల్‌, జూలై 2 : హేలాపురి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శనివారం ఏలూరు వైఎంహెచ్‌ఏ ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు స్మారక ఆహ్వాన నాటిక పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. వైఎంహెచ్‌ఎ కార్యదర్శి మజ్జికాంతారావు, రిజిస్ట్రార్‌ లంకా వెంకటేశ్వర్లు పోటీలను ప్రారంభించారు. తొలుత ప్రియదర్శిని నెల్లూరి వారి వ్యవసాయం నాటికలో రైతు కలుపు మొక్కలను తొలగించి పది మంది ఆకలి తీర్చే పంటను పండించేందుకు వ్యవసాయం చేస్తాడు. మనోక్షేత్రంలో సంఘర్షణ, ధర్మం జయిస్తుందని ఇతి వృత్తంగా వ్యవసాయం నాటిక సాగింది. అనంతరం వీరన్నపాలెం కళానికేతన్‌ వారి లచ్చిందేవి లైన్‌ తప్పింది నాటిక ఆహూతులను అలరించింది.  ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలనే తాపత్రయంలో అప్పులు చేసి జీవి తాన్ని సుఖమయం చేసుకుందామని కొందరు, కట్నాలు గుంజి సంపాదించాలని కొందరు, దొంగతనాలు చేసి జనాలను మోసం చేసి ఇలా అందరూ ఈజీ మనీ కోసం పాకులాడే వారి ఇతివృత్తమే లచ్చిందేవి  లైన్‌ తప్పింది. 

Updated Date - 2022-07-03T06:45:50+05:30 IST