ప్లాస్మా, రక్తంలో కరోనా కౌంట్‌ను తగ్గిస్తుంది

ABN , First Publish Date - 2020-06-01T07:18:57+05:30 IST

రక్తదాతల నుంచి సేకరించే రక్తం, ప్లాస్మాలో కరోనా ఉంటే..? వాటిని స్వీకరించే రోగులకూ ఆ వైరస్‌ సోకుతుంది. 1980లలో హెచ్‌ఐవీ విషయంలో ఇదే జరిగింది. కరోనా విషయంలో ఆ ముప్పు ఉండకుండా...

ప్లాస్మా, రక్తంలో కరోనా కౌంట్‌ను తగ్గిస్తుంది

హ్యూస్టన్‌, మే 31: రక్తదాతల నుంచి సేకరించే రక్తం, ప్లాస్మాలో కరోనా ఉంటే..? వాటిని స్వీకరించే రోగులకూ ఆ వైరస్‌ సోకుతుంది. 1980లలో హెచ్‌ఐవీ విషయంలో ఇదే జరిగింది. కరోనా విషయంలో ఆ ముప్పు ఉండకుండా.. కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు ‘మిరసోల్‌ పాథోజెన్‌ రిడక్షన్‌ టెక్నాలజీ సిస్టం’ అనే పరికరాన్ని తయారు చేశారు. దాతల నుంచి సేకరించిన రక్తం, ప్లాస్మా బ్యాగుల్లో కొంత మోతాదులో రిబోఫ్లెవిన్‌ (బీ2 విటమిన్‌)ను చేరుస్తారు. ఆ తర్వాత ఆ బ్యాగులను ఈ యంత్రంలో పెడితే.. అందులోని కరోనా కణాలు నాశనమవుతాయి. కరోనా వైరస్‌ కౌంట్‌ భారీగా పడిపోతుందని పరిశోధకులు వివరించారు.


Updated Date - 2020-06-01T07:18:57+05:30 IST