కాల్వలకు ఇరువైపులా మొక్కలు పెంచాలి

ABN , First Publish Date - 2022-05-27T06:48:27+05:30 IST

నీటిపారుదలశాఖకు చెందిన కాల్వలకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచాలని కలెక్ట ర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు.

కాల్వలకు ఇరువైపులా మొక్కలు పెంచాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 26: నీటిపారుదలశాఖకు చెందిన కాల్వలకు ఇరువైపులా పచ్చదనం ఉండేలా మొక్కలు పెంచాలని కలెక్ట ర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. ఎన్నెస్పీ, ఎస్సారెస్పీ కాల్వలకు ఇరువైపులా ప్రభుత్వ భూముల్లో ప్రకృతి, మెగా ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. 146కి.మీ మేర ఎన్‌ఎస్పీ కాల్వలు ఉన్నాయని, ప్రతి 50కిలోమీటర్లకు ఒక మెగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 212కి.మీ మేర ఎస్సారెస్పీ కాల్వలు ఉన్నాయని, ప్రతి 20కిలోమీటర్లకు ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్నారు. హరితహారం పనుల్లో అలసత్వం వహి స్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హరితహారంలో భాగంగా జిల్లా లో 86లక్షల మొక్కలు నాటడం లక్ష్యమన్నారు. అందుకు గ్రామాలు, పట్టణాల్లో అనువైన ప్రాంతాలను ఎంపికచేయాలన్నారు. అదేవిధంగా గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ మండలానికి రెండు చొప్పున క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలన్నా రు. వీటిని జూన్‌ 2వ తేదీన ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని సూ చించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎస్‌.మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, డీఎ్‌ఫవో ముకుందరెడ్డి, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, కిశోర్‌ కుమార్‌, వెంకారెడ్డి, డీఆర్‌డీవో సుందరి కిరణ్‌కుమార్‌, ఏపీడీ పెంటయ్య, ఐబీ ఎస్‌ఈలు నాగేశ్వర్‌రావు, నర్సింగరావు, ఈఈలు పాల్గొన్నారు.

సకాలంలో రుణాలందించాలి

బ్యాంక్‌ అధికారులు సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసుకుని సకాలంలో రుణాలందించాలని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. నాలుగో త్రైమాసిక రుణ ప్రణాళికపై కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతులకు వ్యవసాయ రుణ లక్ష్యం రూ.1935.57కోట్లు కాగా, ఇప్పటి వరకు రూ.1862.62కోట్లు ఇచ్చామన్నారు. స్వయం సహాయక సంఘాలకు రూ.409.09కోట్లకు రూ.678.56కోట్లు, విద్యా రుణాలు రూ.71.99కోట్లకు రూ.117.32కోట్లు, గృహ రుణాలు రూ.98.98కోట్లకు రూ.233.47కోట్లు, పరిశ్రమలకు రూ.381.18కోట్లకు రూ.339.40కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. జిల్లా వార్షిక రుణ లక్ష్యం రూ.4146.88కోట్లు కాగా, రూ.4457.85కోట్లు 107.50శాతంతో రుణాలు ఇచ్చామన్నారు. ముద్ర, స్వయం సహాయక గ్రూప్‌లకు బ్యాంక్‌ లింకేజీపై బ్యాంక్‌ అధికారులు అలసత్వం చేయకుండా త్వరితగతిన రుణాలందించాలని ఆదేశించారు. అనంతరం 2022-23 వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు, పలు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T06:48:27+05:30 IST