హరితహారంలో భాగంగా రహదారుల వెంట మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-05-24T05:08:37+05:30 IST

తెలంగాణకు హరి తహారంలో భాగంగా జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహ దారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటాలని కలె క్టర్‌ భారతి హోళికేరీ అన్నారు

హరితహారంలో భాగంగా రహదారుల వెంట మొక్కలు నాటాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 23: తెలంగాణకు హరి తహారంలో భాగంగా జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహ దారుల వెంట ఇరువైపులా మొక్కలు నాటాలని కలె క్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. సోమవారం  కలెక్టర్‌ చాంబర్‌లో ఇన్‌చార్జి అటవీ అధికారి శాంతారామ్‌తో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి, జాతీయ రహదారుల శాఖ, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, గత సంవత్సరం జిల్లాకు కేటాయించిన నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించి విజయవంతం చేశామ న్నారు. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా విజ యవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. రహదారుల వెంట ఇరువైపులా దాదాపు300 కిలోమీటర్ల మేర బహుళ వరుసలలో మొక్కలు నాటాలన్నారు. ఇందారం నుంచి అర్జునగుట్ట వరకు, జీఎం కార్యా లయం నుంచి రేపల్లెవాడ వరకు, ఇందన్‌పల్లి నుంచి లక్షెట్టిపేట వరకు అక్కడ నుంచి పాత మంచిర్యాల వరకు మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల శాఖ అధికారి అన్నయ్య, డీఆర్‌డీవో శేషాద్రి, అటవీ, డివిజినల్‌ అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:08:37+05:30 IST