భక్తిశ్రద్ధలతో పీర్ల జలధి

ABN , First Publish Date - 2022-08-09T05:30:00+05:30 IST

మొహర్రం వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో పీర్ల జలధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో పీర్ల జలధి
పామురాయిలో జలధి వెళ్తున్న పీర్లు

అనంతపురంరూరల్‌ , ఆగస్టు 9 : మొహర్రం వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో పీర్ల జలధి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. అనంతపురం రూరల్‌ పరిధిలోని కామారుపల్లి, చియ్యేడు, కృష్ణంరెడ్డిపల్లి, కాట్నేకాలువ, పామురాయి, సోములదొడ్డి ప్రాంతాల్లో అలావు తొక్కుతూ.. సందడి చేశారు. రాప్తాడు  మండలంలోని గంగలకుంట, గొందిరెడ్డిపల్లి, బోగినేపల్లి, బండమీదపల్లి గ్రామాల్లో మంగళవారం వైభవంగా జలధి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం, సాయంత్రం పీర్లను ఉరేగించారు. అగ్నిగుండ ప్రవేశం చేశారు. గార్లదిన్నె మండలంలోని గార్లదిన్నె, కల్లూరు, యర్రగుంట్ల, కామలాపురం, పెనకచెర్ల, బూదేడు, కేశవాపురం, కొప్పలకొండ, మర్తాడు తదితర గ్రామాల్లో మంగళవారం వైభవంగా జలధి కార్యక్రమం నిర్వహించారు.  సాయంత్రం పీర్ల స్వాములు ఆగ్ని గుండ ప్రవేశం చేశాయి. కనగానపల్లి కనగానపల్లిలో జలధి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పెద్దఎత్తున గ్రామస్థులు అలావ్‌ తొక్కుతూ సందడి చేశాడు.  బుక్కరాయసముద్రం మండలకేంద్రంతో పాటు 18 గ్రామ పంచాయతీలలో  ఉత్సాహంగా జలధి నిర్వ హించారు. అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. రామగిరి మండలంలోని పోలేపల్లి, మాదాపురం గ్రామాల్లో మంగళవారం మొహరం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సోమవారం రాత్రంతా అలావ్‌ తొక్కారు. మంగళవారం  పీర్లను  ఊరేగించారు.  అగ్నిగుండం ప్రవేశం చేశారు. సాయంత్రం పీర్లను జలధికి తీసుకెళ్లారు. శింగనమల  గొల్లవీధిలో జరిగే వెండిదేవుడు పీరు, చిన్న అక్బర్‌పీరు మధ్య జరిగే గొడవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. గురుగుంట్లలో పోలీసు బందోబస్తు మధ్య పీర్ల పండుగను నిర్వహించారు. చిన్నజలాలపురం, గోవిందరాయు నిపేటలో పీర్లకు జలధి కార్యక్రమం నిర్వహించారు.


Updated Date - 2022-08-09T05:30:00+05:30 IST