వైద్యులు మెరుగైన సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-05-22T05:53:55+05:30 IST

వైద్యరంగానికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు వైద్యులు మెరుగైన సేవలను అందించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. స్థానిక జనరల్‌ ఆస్పత్రిలో నూతన డైట్‌ పాల సీ విధానాన్ని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.

వైద్యులు మెరుగైన సేవలు అందించాలి
సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిని పరిశీలిస్తున్న మంత్రి జగదీ్‌షరెడ్డి, పక్కన కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి

విద్యుత్‌శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి


సూర్యాపేట సిటీ, మే 21: వైద్యరంగానికి ప్రభు త్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు వైద్యులు మెరుగైన సేవలను అందించాలని మంత్రి  జగదీ్‌షరెడ్డి అన్నారు. స్థానిక జనరల్‌ ఆస్పత్రిలో నూతన డైట్‌ పాల సీ విధానాన్ని కలెక్టర్‌ టి.వినయ్‌ కృష్ణారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆస్పత్రు ల్లో ప్రభుత్వం ఆధునాతన వైద్య పరికరాలు ఏర్పాటుచేసిందన్నారు. గుండెపోటు సమయంలో చేసే ఇంజక్షన్లు (త్రంబ్రో లేటిక్‌ థెరపి) జనరల్‌ ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు.అనంతరం అన్ని విభాగాల వై ద్యులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.టి.హబ్‌, వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ శారద పాల్గొన్నారు.


సంప్రదాయాలకు పెద్దపీట

సూర్యాపేటరూరల్‌: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. మండల పరిధిలోని తాళ్లఖమ్మంపహాడ్‌ గ్రా మంలో కంఠమహేశ్వర-సురమాంభ కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి నిర్వహించిన సామూహిక గంపల ప్రదర్శన, బోనాల సమర్పణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవోలు రవీందర్‌రెడ్డి, జడ్పీటీసీ జీడి భిక్షం, వైస్‌ ఎంపీపీ శ్రీనివాసనాయుడు,ఎంపీటీసీ ముదిరెడ్డి ఉజ్వల పాల్గొన్నారు.


అవకాశాలను అందిపుచ్చుకోవాలి

సూర్యాపేటటౌన్‌: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఎస్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు శనివారం ఉచితంగా స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, మరిన్ని నోటిఫికేషన్లు విడుదలకానున్నాయన్నారు. యువత ప్రణాళికాబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించాలని, వారికి ఎస్‌.ఫౌండేషన్‌ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డిగ్రీ కళాశాల సిబ్బంది శ్రీనివాసులు, వీరయ్య, కౌన్సిలర్‌ అనంతుల యాదగిరిగౌడ్‌, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, దేశగాని శ్రీనివాస్‌, కొమ్మ ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:53:55+05:30 IST