భౌతిక దూరం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-03-31T09:13:27+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా

భౌతిక దూరం తప్పనిసరి

గుంటూరు, మార్చి 30: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని అర్బన్‌ పోలీసు అధికారి, డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపె ౖసోమవారం పోలీసు కార్యాలయం లో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో ఆయన  సమీక్షించారు. ఏటీఎంలు, బ్యాంకులు నిత్యవసర దుకాణాలు, కూరగాయల షాపుల వద్ద ప్రజలు నిబంధనలు ఉల్లంఘించకుండా భౌతికదూరం పాటించేలా ఽఅధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


ఉదయం 6 నుంచి 11 గంటలలోపే సమీప ప్రాంతాల్లోని దుకాణాలు, తాత్కాలిక కూరగాయల మార్కెట్ల నుంచి నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేయాలన్నారు. నిబందనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన సుమారు 1,400కు పైగా వాహనాలను సీజ్‌ చేశామని, వాటన్నింటిని లాక్‌డౌన్‌ తరువాత కోర్టులో హాజరుపర్చిన తరువాత మాత్రమే ఇస్తామన్నారు. మంగళదాస్‌నగర్‌లో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాలన్నింటిని రెడ్‌జోన్‌లో చేర్చామన్నారు. ద్విచక్ర వాహనాలపై ఒకరు, కారులో ఇద్దరికి మించి ప్రయాణించరాదన్నారు. డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది, ఇ తర పారా మెడికల్‌ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు  గుర్తింపు కార్డులు ధరించాలన్నారు. 


పనిలేని వారికి భోజన వసతి ఏర్పాట్లు

అర్బన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేక జరుగుబాటు లేక ఇబ్బంది పడుతున్న వారిని అదే విధంగా నివాసం లేకుండా తిండిగడవని వారిని గుర్తించి సంబంధిత తహసీల్దార్ల ద్వారా భోజన వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేసేలా చూడాలని ఆదేశించారు. అటువంటి వారి పట్ల పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్బన్‌ పరిధిలో రవాణా వాహనాలను ఆపవద్దని ఆదేశించారు. 


50 ఏళ్ళు పైబడిన పోలీసులకు..తేలికపాటి విధులు

పోలీసుశాఖలో 50 ఏళ్ళు పైబడిన అధికారులు, సిబ్బందికి బందోబస్తు విధులు కాకుండా తేలికపాటి విధులు కేటాయించాలని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని అన్నారు. అర్బన్‌ పరిధిలో ఫ్యామిలీ వెల్ఫేర్‌ డెస్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దానికి ఇన్‌చార్జిగా ఎస్‌ఐ కృష్ణబాజీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు మరికొంతమంది సిబ్బందిని కేటాయించామని, పోలీసు కుటుంబాల్లో ఉన్న వారికి ఏ సమయంలోనైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే 8688831573 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. 


అర్బన్‌ పరిధిలో ఇప్పటి వరకు 829 మంది విదేశాల నుంచి రాగా ఇప్పటివరకు 802 మందిని గుర్తించామని మరో 27 మంది ఆచూకీ తెలియడం లేదని డీఐజీ పీహెచ్‌డీ రామకృష్ణ స్పష్టం చేశారు. ఆ 27 మందిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో సుమారు 50 మంది వరకు క్వారంటైన్‌లో ఉంచగా అనేక మందికి నెగిటివ్‌ రిపోర్టు రావడంతో డిశ్చార్జ్‌ చేశామన్నారు. ఎయిర్‌పోర్టుల నుంచి వచ్చిన వివరాల ప్రకారం ఆయా పాస్‌పోర్టులలో ఉన్న చిరునామా, ఫోన్‌ నెంబర్లలో 25 మంది అందుబాటులో లేరని వారిని గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్బన్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఏడు కేసులు నమోదు చేసి 18 మందిని అదుపులోకి తీసుకునారు. 13 వాహనాలను సీజ్‌ చేశారు. 


ఇటీవల ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్ళి వచ్చిన వారు స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు రావాలని డిఐజీ రామకృష్ణ సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారు క్వారంటైన్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అర్బన్‌లోని ఎస్‌ఐలు, సీఐలు, డిఎస్పీలు, అదనపు ఎస్పీలు, ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-31T09:13:27+05:30 IST