ఆ చేపను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు

ABN , First Publish Date - 2020-07-12T01:49:02+05:30 IST

చక్కటి నోరు.. దొండపండులాంటి పెదాలు.. ముత్యాల్లాంటి పలువరుస.. నేనేదో అమ్మాయిని పొగుడుతున్నాను అనుకోకండి.. ఇదంతా ఓ చేప గురించి. అవును మలేషియాలో...

ఆ చేపను చూస్తే అవాక్కవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న ఫోటోలు

కౌలాలంపూర్: చక్కటి నోరు.. దొండపండులాంటి పెదాలు.. ముత్యాల్లాంటి పలువరుస.. నేనేదో అమ్మాయిని పొగుడుతున్నాను అనుకోకండి.. ఇదంతా ఓ చేప గురించి.. మలేషియాలో దొరికిన ఈ చేపకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అచ్చం మనిషిలాంటి నోరు, బలమైన దవడలు, పెద్ద పెదాలు, మనిషిలాంటి పళ్లు ఉండడంతో దీనిని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. దీనిని ట్రిగర్‌ఫిష్ అంటారని, ఈ జాతి చేపలు దక్షిణ ఆసియా సముద్రంలో ఎక్కువగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ జాతి చేపల్లో దాదాపు 40 రకాలున్నట్లు వివరిస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ ఫోటోలు ట్విటర్‌లో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వేల లైకులు సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ చేప ఫొటోలకు నెటిజన్లు తమ క్రియేటివిటీని జోడించి సరికొత్తగా రీపోస్టులు చేస్తున్నారు. కనుబొమ్మలు, చేతులను ఫోటోషాప్‌లో యాడ్ చేసి మేమేలు సృష్టిస్తున్నారు.

Updated Date - 2020-07-12T01:49:02+05:30 IST