నెట్‌లో ఫేక్‌ వైరస్‌

ABN , First Publish Date - 2021-05-10T13:43:36+05:30 IST

ఓ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వ్యక్తికి నర్సు టీకా వేస్తున్న వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద.. ‘సిరంజిలో వ్యాక్సిఓ

నెట్‌లో ఫేక్‌ వైరస్‌

జనాలను నమ్మించేలా అవాస్తవ కథనాలు.. వాటికి సాక్ష్యాలంటూ ఫొటోలు, వీడియోలు


అసలే కరోనా మహమ్మారి జనాలను వణికిస్తుంటే వైరస్‌ విషయంలో తప్పుడు వార్తలు వారిని మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలను సృష్టించి, వాటికి ఫేక్‌ వీడియోలు, ఫొటోలను యాడ్‌ చేసి నెట్‌లో వదిలేస్తున్నారు. నిజం ఇల్లుదాటే లోపు అబద్ధం ప్రపంచాన్నే చుట్టేస్తుందన్నట్లు సదరు తప్పు కథనాలు, ప్రచారాలు జనాల మెదళ్లలో పాతుకుపోయి వణికిస్తున్నాయి.  ఇది అబద్ధం అని తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవల నెట్‌లో వైరల్‌ అయిన  సదరు తప్పుడు కథనాలేమిటో ఓసారి చదవేయండి.. 


ఖాళీ సిరంజీతో టీకా

ఓ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వ్యక్తికి నర్సు టీకా వేస్తున్న వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద.. ‘సిరంజిలో వ్యాక్సిఓ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వ్యక్తికి నర్సు టీకా వేస్తున్న వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద.. ‘సిరంజిలో వ్యాక్సిన్‌ నింపకుండానే టీకా ఇచ్చినట్లుగా శరీరంలో సూదిని గుచ్చేసి.. టీకా మందును బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. భాఓ వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో వ్యక్తికి నర్సు టీకా వేస్తున్న వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో కింద.. ‘సిరంజిలో వ్యాక్సిన్‌ నింపకుండానే టీకా ఇచ్చినట్లుగా శరీరంలో సూదిని గుచ్చేసి.. టీకా మందును బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్‌లో భాగంగా నర్సుల నిర్వాకమిది’ అని రాసి షేర్‌ చేస్తున్నారు. ఆ వీడియోకు మన దేశంతో సంబంధమే లేదని, అది మెక్సికోలో తీసిన వీడియోనని తేలింది. ఈ ఫేక్‌ వీడియో అప్పటికే వ్యాక్సినేషన్‌పై చాలా మందిలో అపోహలకు కారణభూతమైంది.


కుర్రాడి కోసం బెడ్‌ త్యాగం చేసిన 85 ఏళ్ల

మహారాష్ట్ర నాగపూర్‌ వాసి, ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తగా పనిచేసిన 85 ఏళ్ల దబాల్కర్‌ గురించి ఆయన కూతురు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. కరోనాతో తన తండ్రి ఇందిరా గాంధీ ప్రభుత్వాస్పత్రిలో చేరాడని, అదే సమయంలో కరోనా సోకి, విషమ పరిస్థితుల్లో ఉన్న ఓ కుర్రాడి విషయం ఆయనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. తాను మహా అయితే ఏడాది బతుకుతానని..  ఆ యువకుడు బతకాలంటూ  తన తండ్రి బెడ్‌ను వదిలేసి ఇంటికి వచ్చేశారని, ఆ మరుసటి రోజే ఆయన మృతిచెందారంటూ ఆమె చెప్పారు. హృదయాన్ని ద్రవింపజేసేలా ఉన్న ఘటనను అబద్ధం అంటూ కొందరు నెట్‌లో పోస్ట్‌లు పెట్టడంతో ఫేక్‌ న్యూస్‌గా ప్రచారమైంది.


రోడ్డుపై వృద్ధురాలు.. పక్కన ఆక్సిజన్‌ సిలిండర్‌ 

‘రోడ్డు పక్కన ఓ వృద్ధురాలు కూర్చుని ఆక్సిజన్‌ సిలిండర్‌ సాయంతో ఊపిరి తీసుకుంటున్న ఓ ఫొటో నెట్‌లో చూసే ఉంటారు. ‘చూశారా.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఇలా రోడ్డుపైనే చికిత్స చేస్తున్నారు. ఇదీ కరోనా సృష్టిస్తున్న విలయం. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం’ అంటూ కామెంట్లు రాసి ఫొటోను తెగ వైరల్‌ చేశారు. యూపీలో తీసిన ఆ ఫొటో 2018 నాటిది.  


ముక్కులో నిమ్మరసం.. కరోనా పరార్‌.. 

ముక్కులో నిమ్మరసం పిండుకోండి. కరోనా మీ దరి చేరదు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ చేరదు. దీన్ని అబద్ధమని నిరూపిస్తే రూ.లక్ష ఇస్తా. ఇది.. వైద్యులు, శాస్త్రవేత్తలకు నా సవాల్‌’ అంటూ ఓ వ్యక్తి పేరుతో పోస్ట్‌ వైరల్‌ అయింది. ఇది నిజమేనని నమ్మి.. కర్ణాటక రాయచూర్‌ జిల్లాకు చెందిన బసవరాజ్‌ అనే ఉపాధ్యాయుడు ముక్కులో నిమ్మరసం పిండుకొని చనిపోయాడు. 


కుంభమేళా ఏర్పాట్లు బేష్‌.. దోభాల్‌ లేఖ

కరోనా ఉధృతిని పట్టించుకోకుడా ఉత్తరాఖండ్‌లో కుంభమేళాకు అనుమతించడంపై ఎన్నో విమర్శలు వ్యక్తమయ్యాయి! అయితే కుంభమేళా గొప్పగా నిర్వహించారంటూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌ లేఖ రాసినట్లు ఓ వార్త నెట్‌లో వైరల్‌ అవుతోంది. అసలే కుంభమేళా వల్ల కరోనా కేసులు పెరిగాయని ఆరోపణలు వస్తున్న తరుణంలో అజిత్‌ దోభాల్‌ ఇలా లేఖ రాయడం ఏమిటని సహజంగానే అనుమానం వచ్చినా.. నమ్మించేందుకు పకడ్బందీగా లేఖను రూపొందించి నెట్‌లో వదిలారు. ఇది ఒట్టి అబద్ధపు వార్త అని తేలింది. 


45 ఎకరాల్లో 6వేల బెడ్స్‌..

భారత్‌లో రెండో అతిపెద్ద కొవిడ్‌ సెంటర్‌ను మధ్యప్రదేశ్‌లో నిర్మిస్తున్నారంటూ నెట్‌లో ప్రచారం జరుగుతోంది. ఇండోర్‌లో 45 ఎకరాల్లో, 4 ఆక్సిజన్‌ ప్లాంట్లతో 6వేల బెడ్స్‌తో దీన్ని ఆరెస్సెస్‌ నిర్మిస్తోందంటూ ఓ కళ్లుచెదిరే నిర్మాణం తాలూకు ఫొటో పెట్టి మరీ కథనాన్ని వండివార్చారు. తీరా ఆరా తీస్తే అసలు అక్కడ అలాంటి నిర్మాణం పనులేవీ జరగడం లేదని తేలింది. నెట్‌లో వైరల్‌ అవుతున్న ఆ ఫొటో ఖతర్‌లోని ఆల్‌ బైట్‌ స్టేడియానికి సంబంఽధించింది కావడం గమనార్హం. 


నెబులైజర్‌తో ఆక్సిజన్‌ 

మీ వాళ్లకు ఆక్సిజన్‌ స్యాచురేషన్‌ లెవల్స్‌ తగ్గాయా? మెడికల్‌ ఆక్సిజన్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నారా? కంగారేమీ లేదు. ప్రత్యామ్నాయంగా నెబులైజర్‌ వాడొచ్చని.. అది ఆక్సిజన్‌ సిలిండర్‌ మాదిరిగే పనిచేస్తుందంటూ  ఓ హెల్త్‌ కేర్‌ వర్కర్‌ చెబుతున్నట్లుగా ఓ వీడియో వైరల్‌ అవుతోంది. నా పేరు డాక్టర్‌ అలోక్‌. ఫరీదాబాద్‌లోని సర్వోదయా ఆస్పత్రిలో పనిచేస్తున్నాను. రక్తంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ను పెంచేందుకు నెబులైజర్‌ను కూడా వాడొచ్చు. ఈ టెక్నిక్‌ ద్వారా వేల మంది ప్రాణాలను కాపాడవొచ్చు’ అని ఆ వ్యక్తి  చెప్పాడు. ఆ వీడియోను నమ్మొద్దని.. ఆక్సిజన్‌కు నెబులైజర్‌ ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2021-05-10T13:43:36+05:30 IST