Health and Family వెల్ఫేర్‌ సంస్థలో పీజీడీఎం

ABN , First Publish Date - 2022-08-12T20:44:22+05:30 IST

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(National Institute of Health and Family Welfare)(ఎన్‌ఐహెచ్‌ఎఫ్ డబ్ల్యూ) - దూరవిద్య(distance education) విధానంలో నిర్వహిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌

Health and Family వెల్ఫేర్‌ సంస్థలో పీజీడీఎం

న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌(National Institute of Health and Family Welfare)(ఎన్‌ఐహెచ్‌ఎఫ్ డబ్ల్యూ) - దూరవిద్య(distance education) విధానంలో నిర్వహిస్తున్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(Post Graduate Diploma in Management) (పీజీడీఎం) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్‌నకు ఏఐసీటీఈ, కేంద్ర ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల గుర్తింపులు ఉన్నాయి. ప్రోగ్రామ్‌ వ్యవధి 15 నెలలు. గరిష్ఠంగా మూడేళ్లలో పూర్తిచేయవచ్చు. ప్రోగ్రామ్‌లో భాగంగా రెండు కాంటాక్ట్‌ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఒక్కోదానిని అయిదు రోజులపాటు నిర్వహిస్తారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రోగ్రామ్‌నకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ అందిస్తారు. నిబంధనల ప్రకారం అసైన్‌మెంట్‌లు, డిజర్టేషన్స్‌, ఫైనల్‌ ఎగ్జామ్స్‌ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్‌లు ప్రదానం చేస్తారు. అభ్యర్థులు ఫైనల్‌ ఎగ్జామ్స్‌ను హిందీ మాధ్యమంలో కూడా రాయవచ్చు. 


స్పెషలైజేషన్‌లు - సీట్లు: హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ 300 సీట్లు, హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ మేనేజ్‌మెంట్‌ 100 సీట్లు, హెల్త్‌ ప్రమోషన్‌ 150 సీట్లు, పబ్లిక్‌ హెల్త్‌ న్యూట్రిషన్‌ 150 సీట్లు, హెల్త్‌ కమ్యూనికేషన్‌ 150 సీట్లు, అప్లయిడ్‌ ఎపిడిమియాలజీ 150 సీట్లు ఉన్నాయి. 

అర్హత: ఎంబీబీఎస్‌/ ఎంఎస్‌/ ఎండీ/ బీడీఎస్‌/ ఎండీఎస్‌/ బీఎస్సీ(నర్సింగ్‌ / జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ)/ ఆయుష్‌ కోర్సులు/ డిగ్రీ (సైన్స్‌/ సోషల్‌ సైన్సెస్‌/ ఎపిడిమియాలజీ/ స్టాటిస్టిక్స్‌)/ బీఫార్మసీ/ మాస్టర్స్‌ (పబ్లిక్‌ హెల్త్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌ పూర్తయిన తరవాత కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి. సంబంధిత నేషనల్‌ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. 


ముఖ్య సమాచారం

ఎంపిక: సెలెక్షన్‌/ స్ర్కీనింగ్‌ కమిటీ నిర్ణయం మేరకు  అభ్యర్థులను ఎంపిక చేస్తారు.   

దరఖాస్తు ఫీజు: రూ.500    

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 31   

వెబ్‌సైట్‌: www.nihfw.org

Updated Date - 2022-08-12T20:44:22+05:30 IST