IIT కాన్పూర్‌లో పీజీ ప్రోగ్రామ్‌

ABN , First Publish Date - 2022-10-04T23:50:02+05:30 IST

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీకే) ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌

IIT కాన్పూర్‌లో పీజీ ప్రోగ్రామ్‌

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీకే) ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ - పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఫర్‌ విజనరీ లీడర్‌షిప్‌ ఇన్‌ మాన్యుఫాక్చరింగ్‌(పీజీపీఈఎక్స్‌ - వీఎల్‌ఎం)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఇది ఏడాది వ్యవధి గల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. దీనిని  కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఏజెన్సీ (జేఐసీఏ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ ఉమ్మడిగా రూపొందించాయి. దీనికి ఐఐఎం కోల్‌కతా, ఐఐటీ మద్రాస్‌ సహకారం అందిస్తున్నాయి. ప్రోగ్రామ్‌లో భాగంగా 36 వారాల క్లాస్‌ రూం స్టడీ, కేస్‌ స్టడీస్‌, ల్యాబ్‌ సెషన్స్‌, ఇండివిడ్యువల్‌ అండ్‌ టీం అసైన్‌మెంట్స్‌, జపనీస్‌ ఫ్యాకల్టీ గెస్ట్‌ లెక్చర్స్‌ ఉంటాయి. వారంపాటు జపాన్‌లో ఇండస్ట్రియల్‌ విజిట్‌ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్‌లో 40 సీట్లు ఉన్నాయి.


అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి.  కనీసం నాలుగున్నరేళ్ల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు ఇండస్ట్రియల్‌ అనుభవం ఉండాలి. జీమ్యాట్‌ స్కోర్‌ తప్పనిసరి కాదు.

ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి నిబంధనల ప్రకారం షార్ట్‌లిస్ట్‌ రూపొందిస్తారు. వీరిని మాత్రమే రిటెన్‌ టెస్ట్‌కు అనుమతిస్తారు. రిటెన్‌ టెస్ట్‌లో అనలిటికల్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీస్‌, ఇంజనీరింగ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలనుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం రెండు గంటలు. ఈ టెస్ట్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.


ముఖ్య సమాచారం

ఫీజు: రూ.3,500     

చివరి తేదీ: నవంబరు 10 

దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: నవంబరు 14

రిటెన్‌ టెస్ట్‌నకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: నవంబరు 26న

రిటెన్‌ టెస్ట్‌ కేంద్రాలు: ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై

రిటెన్‌ టెస్ట్‌ తేదీ: డిసెంబరు 11

పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ విడుదల: డిసెంబరు 14న

పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2023 జనవరి 1న

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 2023 జనవరి 3న

వెబ్‌సైట్‌: www.iitk.ac.in/ime/vlm

Updated Date - 2022-10-04T23:50:02+05:30 IST