Abn logo
Apr 13 2021 @ 01:23AM

పీఎఫ్‌ పెన్షన్‌ రూ.7,500 చెల్లించాలి

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 12: ఏపీఎస్‌ ఆర్టీసీ విశ్రాం త ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎఫ్‌ పెన్షన్‌ రూ.7,500చొప్పున పెంచి డీఏలు చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం విజ్ఞప్తి చేసింది.  అమలాపురం రైతుబజార్‌ ప్రాంగణంలో సోమవారం డిపో కమిటీ కార్యదర్శి కె.నరసింహారావు అధ్యక్షతన సమా వేశం జరిగింది. ఇటీవల మృతిచెందిన సంఘ సభ్యులకు ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం నూతన కార్యవ ర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ  సభ్యుడిగా పీఎస్‌ నారాయణ, ముఖ్య సలహా దారులుగా ఎస్‌.నాగేశ్వ రరావు, జేఎస్‌ నారాయణ, కె.రాధాకృష్ణ, అధ్యక్ష, కార్యద ర్శులుగా డి.రాధాకృష్ణ, కె.నరసింహారావు, ఉపాధ్య క్షుడిగా డీవీబీ రావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా వీఎస్‌ఎన్‌ రాజు, పబ్లిసిటీ కార్యదర్శులుగా ఏవీ రాము, ఆర్‌ శంకర రావు, కోశాధికారులుగా ఆర్‌టీ రావు, వై.ధర్మారావుతో పాటు కమిటీ మెంబర్లుగా పీఎస్‌ నారాయణ, పి.కృష్ణమూర్తి, డీవీ వీఎస్‌ నారాయణ, ఎం.శ్యామలరావులను ఎన్నుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement