పెట్రోల్‌, డీజీల్‌ కొలతల్లో తేడాలు.. బంక్‌ సీజ్‌

ABN , First Publish Date - 2021-10-08T17:24:47+05:30 IST

వైరాలోని మధిర రోడ్డులో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఎదరుగా ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో గురువారం తూనికల కొలతల అధికారి తనిఖీ నిర్వహించారు. పెట్రోల్‌, డీజీల్‌ కొలత

పెట్రోల్‌, డీజీల్‌ కొలతల్లో తేడాలు.. బంక్‌ సీజ్‌

వైరా(ఖమ్మం): వైరాలోని మధిర రోడ్డులో వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు ఎదరుగా ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌లో గురువారం తూనికల కొలతల అధికారి తనిఖీ నిర్వహించారు. పెట్రోల్‌, డీజీల్‌ కొలతల్లో తేడా విషయం ఈ తనిఖీలో బయటపడింది. దాంతో ఆ పెట్రోల్‌ బంక్‌పై చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌ జీడిమెట్లలోని ఇండియన్‌ ఆయిల్‌ బంక్‌లో కొలతలు తగ్గించే చిప్‌ ఏర్పాటు చేస్తున్న ఒక ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా వైరాలోని పెట్రోల్‌ బంక్‌ పేరు కూడా చెప్పినట్లు సమాచారం. దాంతో వైరా ఎస్‌ఐ సురేష్‌ బందోబస్తు మధ్య జిల్లా తూనికల కొలతల అధికారిణి అధికారి తనిఖీ నిర్వహించారు. ఐదు లీటర్ల పెట్రోల్‌కు 185 మిల్లీ లీటర్లు, ఐదు లీటర్ల డీజీల్‌కు 173 మిల్లీ లీటర్లు తక్కువగా ఉంది. మోసం బయటపడటంతో పెట్రోల్‌బంక్‌ను అధికారులు సీజ్‌ చేశారు.

Updated Date - 2021-10-08T17:24:47+05:30 IST