Abn logo
Oct 1 2020 @ 02:50AM

కృష్ణ జన్మభూమిపై పిటిషన్‌ కొట్టివేత

  • మసీదు తొలగింపునకు కోర్టు నో


మథుర, సెప్టెంబరు 30: ఉత్తరప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి-ఈద్గా వివాదంపై వ్యాజ్యాన్ని స్థానిక కోర్టు కొట్టేసింది. కృష్ణ జన్మస్థానానికి ఆనుకుని ఉన్న మసీద ను తొలగించాలన్న పిటిషనర్ల  వాదనను కోర్టు తోసిపుచ్చింది. 1991నాటి ప్ర్థార్థనా స్థలాల ప్రత్యేక చట్టం ప్రకారం దేశంలో 1947నాటికి ఉన్న ఏ ప్రార్థనా స్థలం యథాతథస్థితిని మార్చే ఎలాంటి వ్యాజ్యాన్నీ అంగీకరించరాదనీ, దాని ప్రకారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టలేమని జడ్జి ఛాయా శర్మ స్పష్టం చేశారు. 1991నాటి చట్టం ఒక్క బాబ్రీ మసీదు-రామజన్మభూ మి స్థలాన్ని మాత్రమే మినహాయించిందన్నారు. కోర్టు తీర్పు ప్రతికూలంగా రావడంతో కేసు వేసిన ఏడుగురు అలహాబా ద్‌ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. రామజన్మభూమి వివాదం తరహాలోనే కృష్ణ జన్మభూమి వివాదంపై కూడా హిందూత్వ గ్రూపులు దృష్టి సారించాయి.  మథురలో ఆ ప్రాంగణం ఉన్న 13.37 ఎకరాలూ శ్రీకృష్ణ భగవానుడికే చెందుతుందని పిటిషనర్ల వాదన. ఈ వ్యవహారంపై చర్చకు అక్టోబరు 15న బృందావనంలో సమావేశమవుతున్నట్లు అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్ర గిరి చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement