సమావేశంలో మాట్లాడుతున్న సదానందంగౌడ్
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్
సిద్దిపేట, జూలై 3: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్ అన్నారు. ఆదివారం ఎస్టీయూ సిద్దిపేట జిల్లాశాఖ తృతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ అధికారులతో పలుమార్లు కలిసి చర్చించినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ప్రభుత్వ వైఖరి ఉపాధ్యాయ ఉద్యమ ఉధృతికి దోహదం చేస్తున్నదన్నారు. పాఠశాల, విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ 5న డీఎ్‌సఈ ముట్టడి కార్యక్రమానికి తరలివచ్చి మన సమిష్టి ఉద్యమ తీవ్రతను ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మట్టపల్లి రంగారావు, కరుణాకర్‌రెడ్డి, మ్యాడ శ్రీధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.