మహిళకు కరపత్రం అందిస్తున్న కురుగొండ్ల రామకృష్ణ.
బాదుడే బాదుడులో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల
కలువాయి, జూన్ 27 : సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అవస్థలు పడుతున్నారని వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని వెంకటరెడ్డిపల్లి, కుల్లూరు గ్రామాల్లో సోమవారం టీడీపీ ఆధ్వర్యాన జరిగిన భాదుడే బాదుడు కార్యక్రమం సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి వైపీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలను వివరించి కరప త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసరాలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి ప్రజలు అలాడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు మాత్రం ఇష్టారాజ్యంగా ఇసుక అమ్ముకుని కోట్లు సంపాదించుకుంటున్నారని, టీడీపీ అధికారంలోని వచ్చాక వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు జీ.వెంకటేశ్వర్లు నాయుడు, సుదర్శన్, సోమయ్య యాదవ్, కిశోర్‌రెడ్డి, జగదల్‌నాయుడు, చల్లా విజయభాస్కర్‌రెడ్డి, కండే శ్రీనివాసులు పాల్గొన్నారు.