ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-01-19T06:42:38+05:30 IST

ప్రజలు ఇచ్చే అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను సూచించారు.

ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

నిర్మల్‌ టౌన్‌, జనవరి 18 : ప్రజలు ఇచ్చే అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను సూచించారు. సోమవారం జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. 25 దరఖాస్తులు వచ్చాయని అందులో ఖానాపూర్‌కు చెందిన గంగమణి పట్టాభూమి నమోదు కొరకు, నిర్మల్‌ పట్టణం లోని కమలానగర్‌ కాలనీ వాసులు అనుమతి లేకుండా 5 అంతస్థుల భవనం నిర్మించినందున చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు వచ్చిందన్నారు. సారంగాపూర్‌ కు చెందిన శివనాగం సర్వే నెంబర్‌ 192/ అ డిజిటల్‌ సంతకం కొరకు, భైంసాకు చెందిన క్రాంతికుమార్‌ ధరణి పోర్టల్‌లో ఖాతానెంబర్‌ 314 యొక్క వివరాలు తెలపాలని వివిధ రకాల దరఖాస్తులు వచ్చాయని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అఽధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జియోటవర్‌కు కనె క్షన్‌ ఇప్పించాలని కలెక్టర్‌కు వినతి

నిర్మల్‌ టౌన్‌, జనవరి 18 : పెంబి మండలంలోని అంకెనా గ్రామంలో జియో టవర్‌కు కనెక్షన్‌, వివిధ గ్రామాల్లో రోడ్డు నిర్మాణాలు, త్రీఫేస్‌ కరెంట్‌ ఇప్పించాలని పెంబి జడ్పీటీసీ భుక్య జానుబాయి సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్న భారతి

లక్ష్మణచాంద, జనవరి 18 : మండలంలోని కనకాపూర్‌లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న భారతి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. గత సెప్టెంబరు 5న ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికైనట్లు ప్రకటించబడినప్పటికీ అవార్డును మాత్రం సోమవారం కలెక్టర్‌ మహమ్మద్‌ అలీ ఫారూఖీ చేతుల మీదుగా అందుకున్నారు. అవార్డు అందుకున్న భారతిని తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. 

Updated Date - 2021-01-19T06:42:38+05:30 IST