వీళ్లింతే !

ABN , First Publish Date - 2020-04-10T11:05:52+05:30 IST

కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వ నిబంధనను ప్రజలు పాటించడం లేదు.

వీళ్లింతే !

భౌతిక దూరం పాటించని ప్రజలు

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా కనబడని భయం

రోడ్లపై యథేచ్ఛగా రాకపోకలు

కిక్కిరిసిన మార్కెట్‌లు, బ్యాంకులు

జరిమానాలతో సరిపెడుతున్న పోలీసులు


అనంతపురం,ఏప్రిల్‌9(ఆంధ్రజ్యోతి) :  కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే ఇళ్లకే పరిమితం కావాలన్న ప్రభుత్వ నిబంధనను ప్రజలు పాటించడం లేదు. భౌతిక దూరాన్ని పాటించడమే మరిచిపోయారు. యథేచ్ఛగా రో డ్లపై షికార్లు చేస్తున్నారు. మార్కెట్‌లు, బ్యాంకులు కిక్కి రిసిపోతున్నాయి. ఇప్పటికే జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 13కు చేరుకున్నాయి. వీరిలో ఇద్దరు చనిపోయా రు. వందలాది మంది హోమ్‌ క్వారంటైన్‌లలో ఉన్నారు. పోలీసుల ఆంక్షలు ప్రజలను నిలువరించలేకపోతున్నాయి. ఈ పరిణామాలు మరింత భయాందోళనలను రేకెత్తిస్తు న్నాయి.


గురువారం అనంతపురం నగరంలో విచ్చలవిడి గా జనం వేళపాలా లేకుండా రోడ్లపై షికార్లు చేశారు. ఇళ్ల ల్లో కాకుండా ఇంటి ముంగిట ముచ్చట్లకు తెరలేపారు. గుంపులుగుంపులుగా కూర్చొని కాలక్షేపానికే ప్రాధాన్యత నిస్తున్నారు. ఇక్కడేమైనా భౌతిక దూరాన్నిపాటిస్తున్నారా అంటే అదీ లేదు. ఇక తాడిపత్రి బస్టాండ్‌ సాధారణ రోజుల్లో ఏ విధంగా ఉందో.... అదే రద్దీగా కనిపించింది. వాహనాలు పదుల సంఖ్యలో కనిపించాయి. తిలక్‌రోడ్డులో తోపుడుబండ్లు అధికం కావడంతో పండ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు గుంపులుగుంపులుగా చేరారు.  పా తూరులో ఉన్న మార్కెట్‌ను చెరువు కట్ట వద్దకు మార్చిన నేపథ్యంలో అక్కడ భౌతిక దూరానికి అవకాశముంటుం దని అంతా అనుకున్నారు. కానీ అక్కడ కూడా పాతూరు మార్కెట్‌నే తలపించింది. జనం గుంపులుగుంపులుగా చేరి కాయగూరలు కొనడంలో నిమగ్నమయ్యారు.


కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు జిల్లా కేంద్రంలో నమోదయ్యా యన్న విషయాన్నే మరిచారు. జీరో అకౌంట్‌ ఓపెన్‌ చేసేం దుకు బ్యాంకుల వద్ద ప్రజలు గుమిగూడారు. అక్కడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవడంలో శ్రద్ధ చూపలేదు. ఒక్క హిందూపురం మినహా మిగిలిన అన్ని పట్టణాల్లోనూ ఇదే వ్యవహారం కొనసాగుతోంది. మండల కేంద్రాలకు ఈ సంస్కృతి పాకు తోంది. హిందూపురంలో పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదు కావడంతో పాటు ఏ ప్రాంతంలో అయితే పా జిటివ్‌ కేసులు ఉన్నాయో ఆ ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించిన నేపథ్యంలోనే నిర్బంధం కొనసాగడానికి ప్ర ధాన కారణం. అక్కడ ప్రజలు భయంతో ఇంటి నుంచి బయటకు రావడం లేదు.


మిగిలిన కొన్ని ప్రాంతాల్లో ప్ర జలు బయటికొచ్చి షికార్లు చేస్తున్నారు. ఇక పోలీసులైతే రోడ్లపైకి వచ్చే వాహనదారులకు ఫైన్‌లు వేయడంలోనే శ్రద్ధ చూపుతున్నారు.  మరి కొన్ని ప్రాంతాల్లో గుంజీలు తీయించి శిక్షలు అమలు చేస్తున్నారు. ఎక్కడా నిర్బంధానికి తావులేని పరిస్థితులు కనిపిస్తుండటంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమెలా అన్న ప్రశ్న మెజార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. రెవెన్యూ, జిల్లా యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతుందేతప్పా.... క్షేత్రస్థాయిలో ఆ మేరకు ఆచరణలో ఉంచడం సాధ్యం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖదే ప్రధా న బాధ్యత. పోలీసులే కఠినంగా వ్యవహరించి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


జిల్లా ఎస్పీ స్థానిక పోలీసు అధికారులను అప్రమత్తం చేసి రోడ్లపైకి జనం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో బయటకొచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడాలి.  వ్యాపార వర్గాలు సైతం ఆ మేరకు జాగ్రత్తలు తీసుకునేలా పోలీసు శాఖ నుంచి కఠినమైన ఆదేశాలు  ఇవ్వాల్సి ఉంది. 


Updated Date - 2020-04-10T11:05:52+05:30 IST