స్వచ్ఛందంగా ముందుకు...

ABN , First Publish Date - 2021-05-12T06:11:44+05:30 IST

పరిస రాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అనే అవగా హనతో రాఘవా పురం గ్రామస్థులు తమ గ్రామా న్ని శుభ్రం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.

స్వచ్ఛందంగా  ముందుకు...

చింతలపూడి, మే 11 : పరిస రాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం అనే అవగా హనతో రాఘవా పురం గ్రామస్థులు తమ గ్రామా న్ని శుభ్రం చేసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంగళవారం గ్రామ సర్పంచ్‌ కె. వజ్రం ఆధ్వర్యంలో పలు వీధుల్లో తుప్పలు నరికి రోడ్లు ఊడ్చి డ్రైయినేజీలు బాగు చేసి బ్లీచింగ్‌ చల్లి కార్యక్రమానికి  నాంది పలికారు. పంచాయతీ అధికారులు హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.  ఇలా అందరూ ముందుకొస్తే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఈవోపీఆర్‌డీ విక్టర్‌బాబు పేర్కొన్నారు.  గ్రామస్థుడు కె కిషోర్‌, కార్యదర్శి సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-12T06:11:44+05:30 IST