ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ABN , First Publish Date - 2022-05-23T06:56:58+05:30 IST

‘ఒక్క చాన్సుపేరుతో అధికారం చేపట్టిన జగన్‌ నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీలు, ఇసుక ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచాడని అని టీడీపీ ఎమ్మెల్సీ ఎస్‌ఎన్‌డీ ఫరూక్‌ అన్నారు.

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ ఫరూక్‌

చంద్రబాబు సభలకు వస్తున్న ప్రజలే నిదర్శనం

ఎమ్మెల్సీ ఎస్‌.ఎన్‌.డీ.ఫరూక్‌

ఎర్రగొండపాలెం, మే 22 : ‘ఒక్క చాన్సుపేరుతో అధికారం చేపట్టిన జగన్‌ నిత్యావసర ధరలు, విద్యుత్‌ చార్జీలు, ఇసుక ధరలు పెంచి ప్రజల నడ్డివిరిచాడని అని టీడీపీ ఎమ్మెల్సీ ఎస్‌ఎన్‌డీ ఫరూక్‌ అన్నారు. ఎర్రగొండపాలెంలో ఆదివారం జరిగిన మహానాడు సన్నాహక టీడీపీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజల సంక్షేమ మరచి అరాచకాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులను వేదించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టీడీపీ నాయకులు ప్రజలలోకి వెళ్లి కార్యక్రమాలు చేయాలంటే నిదుర లేవక ముందే పోలీసులు ప్రత్యక్షమై హౌస్‌ అరెస్టుల పేరుతో వేదింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ తరహా పరిపాలన బ్రిటిష్‌ పాలనలో జర్మనీలో ఉండేదన్నారు. ఈ నెల 27, 28 తేదీలో జరిగే రాష్ట మహానాడు నియోజకవర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలన్నారు. అందరు కలసి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, అందుకు నిదర్శనంగా ఇటీవల చంద్రబాబు సభలకు భారీగా ప్రజలు తరలివచ్చి స్వాగతం పలికారన్నారు. టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, నూనెధరలు పెంచి ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మద్యం దుకాణాలను తగ్గిస్తానని చెప్పి ప్రభుత్వమే  చీప్‌లిక్కర్‌ క్వార్టర్‌ బాటిల్‌ రూ.160కి అమ్ముతున్నారన్నారు. పశ్చిమ ప్రకాశానికి సాగునీరు, తాగునీరు అందించే వెలిగొండప్రాజెక్టును పూర్తిచేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. నియోజకవర్గ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జీవితకాలంలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేయలేరన్నారు. వైసీపీ అధికారం వచ్చిప్పటి నుంచి దళితులపై వేధింపులు పెరిగాయన్నారు. విక్రమ్‌, కిరణ్‌ దళతబిడ్డలేని అన్నారు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే టీడీపీ ఎర్రగొండపాలెం విజయం సాధించాలని అన్నారు. 

వెలిగొండను చంద్రబాబే ప్రారంభిస్తారు

వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చంద్రబాబే చేశాడని, ఆయనే ప్రాజెక్టును ప్రారంభిస్తారని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ‘అన్నవస్తున్నాడు’ అని చెప్పాడని, అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడేళ్లలో ప్రజలకు చేసింది ఏమిలేదన్నారు. అన్నింటా రేట్లు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. పూర్వం హిట్లర్‌కు జర్మనీలో 90శాతం ఓట్లు వేస్తే ఈ తరహా పరిపాలన సాగించారని, మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అదే పరిపాలన చేస్తున్నారని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పూర్తి అయ్యిందని, మరో రూ.15 వందల కోట్లు ఖర్చుచేస్తే ప్రాజెక్టు పూర్తి అవుతుందని ఆ ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం  చేస్తోందన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి లేదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి విజయంకోసం సైనికుల్లా  పనిచేయాలని అన్నారు. ఈ  సభకు  టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు అధ్యక్షత వహించారు. సభలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు,  టీడీపీ మండల అధ్యక్షులు వరుసగా  పయ్యావుల ప్రసాద్‌, మేకల వళరాజు, మెట్టు శ్రీనివాసరెడ్డి, యేర్వ మల్లికార్జురెడ్డి, నాయకులు కామేపల్లి వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, శనగా నారాయణరెడ్డి, వడ్లమూడి లింగయ్య, గొట్టం శ్రీనివాసరెడ్డి, కే.కోటయ్య, మైనార్టీ నాయకులు ఎస్‌ ఎండీ.యూసఫ్‌, షేక్‌ మాబు ఎస్టీ సెల్‌ రాష్ట్రకార్యదర్శి మంత్రునాయక్‌, టీడీపీ ముఖ్యనాయకులు గోళ్ల.సుబ్బారావు, తోట మహేష్‌ కొత్తమాసు సుబ్రహ్మణ్యం, ఎస్టీ నాయకులు చెవుల అంజయ్య, రైతునాయకులు చిట్యాల వెంగళరెడ్డి, పోతిరెడ్డి రమణారెడ్డి, నియోజకవర్గ మైనార్టీ సెల్‌ అధ్యక్షులు షేక్‌ ఇస్మాయిల్‌, జిల్లా నాయకులు షేక్‌ మాబు, జిల్లా బీసీసెల్‌ కార్యదర్శి చంద్రగుంట నాగేశ్వరరావు, జిల్లా తెలుగుయువత కార్యదర్శులు పాలడుగు వెంకటకోటయ్య, పోట్ల గోవింద్‌, దోడ్డా శేషాద్రి, ఎస్సీసెల్‌ నాయకులు ఎల్‌ అబ్రహం, చేదూరి కిశోర్‌, చేదూరి లక్ష్ముయ్య, నియోజకవర్గంలో టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి

రాచర్ల : టీడీపీ బలోపేతానికి బీసీ సంఘాల నుంచి తనవంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని టీడీపీ ఒంగోలు పార్లమెంటు బిసి సెల్‌ అధికార ప్రతినిధి నల్లబోతుల శ్రీనివాసులు అన్నారు. రాచర్లలో ఆయన శనివారం మాట్లాడుతూ తనను టీడీపీలో బీసీ సెల్‌ అధికార ప్రతినిధిగా నియమించడం సంతోషించదగ్గ విషయమన్నారు. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మె ల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి సహకారంతో గ్రామగ్రామాన పర్యటించి టీడీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

నేడు మహానాడు సన్నాహక సమావేశం

కంభం : కంభం పట్టణంలోని శీలంవీధిలోని శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం సాయంత్రం మహానాడు సన్నాహక సమావేశం జరగనుందని టీడీపీ మండల  అధ్యక్షులు తోట శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సన్నాహక సమావేశంలో కంభం, బేస్తవారపేట, అర్థవీడు మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.


Updated Date - 2022-05-23T06:56:58+05:30 IST