బిలాస్పూర్ : ఏదైనా సరుకుతో ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురవ్వడం.. కిందపడిపోయిన లోడ్‌ను జనాలు ఎగబడి మరీ ఎత్తుకెళ్లిన ఘటనలు అనేకం చూశాం. ఇదే తరహాలో మరో ఘటన చత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసింది. శనగపప్పు లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ వద్ద ప్రమాదానికి గురయింది. లారీ కిందపడ లేదు.. అందులోని సరుకు చెక్కుచెదరలేదు. కానీ సమీప ప్రాంత జనాలు లారీపై తండోపతండాలుగా ఎగబడ్డారు. లోడ్ విప్పుకుని మరీ శనగ పప్పు బస్తాలను యుద్ధప్రాతిపదికన మోసుకెళ్లారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ ఇంత ఆత్రుతా అంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.