వార్తలపై ఆసక్తి.. డబ్బులు చెల్లించేందుకు ఓకే

ABN , First Publish Date - 2020-04-03T09:50:19+05:30 IST

మన దేశంలో వార్తల పట్ల జనం బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. వాటి కోసం డబ్బులు వెచ్చించడానికి మూడింట రెండొంతుల మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం...

వార్తలపై ఆసక్తి.. డబ్బులు చెల్లించేందుకు ఓకే

  • వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం అధ్యయనం


న్యూఢిల్లీ/జెనీవా, ఏప్రిల్‌ 2: మన దేశంలో వార్తల పట్ల జనం బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. వాటి కోసం డబ్బులు వెచ్చించడానికి మూడింట రెండొంతుల మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారని వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరం అధ్యయనం చెబుతోంది. అయితే, నాలుగో వంతు వినియోగదారులు మాత్రమే వార్తల కోసం డబ్బులు చెల్లిస్తున్నారు. భారత్‌, చైనా, జర్మనీ, దక్షిణ కొరియా, యూకే, యూఎ్‌సలలో ఈ అధ్యయనం చేశారు. ఈ ఆరు దేశాల్లో అధిక శాతం వినయోగదారులు వార్తలు చదవడం, వినడం, వినోద కార్యక్రమాలకు వారంలో 24గంటలు వెచ్చిస్తుంటే.. సగం మంది మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నారు. 44 శాతం వినోద కార్యక్రమాల కోసం చెల్లిస్తుండగా.. వార్తల కోసం 16శాతం మంది డబ్బులు వెచ్చిస్తున్నారు. 


Updated Date - 2020-04-03T09:50:19+05:30 IST