Abn logo
Jun 12 2021 @ 23:35PM

అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

రూ.3.80 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప(ఎర్రముక్కపల్లె), జూన్‌ 12: నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పిలుపునిచ్చారు. కడప 20వ డివిజను పరిధిలో శనివారం రాజీవ్‌మార్గ్‌ నాలుగు రోడ్ల కూడలి వద్ద రూ.3.80 కోట్లతో నూతన రోడ్ల విస్తరణ పనులకు డిప్యూటీ సీఎంతో పాటు మేయర్‌ సురే్‌షబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చేస్తున్న రాజీవ్‌మార్గ్‌ రోడ్ల విస్తరణ సుందరీకరణ పనులకు నేడు భూమిపూజ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ లవన్న, స్థానిక కార్పొరేటరు మాధవి, కార్పొరేషన్‌ అధికారులు పాల్గొన్నారు.