ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాలి

ABN , First Publish Date - 2021-10-24T05:20:55+05:30 IST

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కార్మికులతోపాటు ప్రజలు ఐక్యంగా ఉద్యమించి పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు అన్నారు.

ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు ప్రజలు ఉద్యమించాలి
భెల్‌ హెచ్‌పీవీపీలో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న సీహెచ్‌.నరసింగరావు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు 

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 23: ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ కాకుండా కార్మికులతోపాటు ప్రజలు ఐక్యంగా ఉద్యమించి పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌.నరసింగరావు అన్నారు. విశాఖ పబ్లిక్‌ సెక్టర్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భెల్‌ హెచ్‌పీవీపీ కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కోటి సంతకాల సేకరణ వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా స్థాపించలేని కేంద్ర ప్రభుత్వం ఉన్న వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి వారిని ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు ఎం.జగ్గునాయుడు, వివిద సంస్థల నాయకులు జె.అయోధ్యరామ్‌, కె. కామేశ్వరి, జీటీపీ ప్రకాశ్‌, కుమార మంగళం, ఈఆర్‌ఎస్‌వీ కుమార్‌, గంగారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T05:20:55+05:30 IST