భారీ వర్షాలకు రెండు రోజుల్లో 129 మంది మృతి... పలువురు గల్లంతు!

ABN , First Publish Date - 2021-07-24T12:47:20+05:30 IST

మహారాష్ట్రలో గడచిన కొన్ని రోజులుగా...

భారీ వర్షాలకు రెండు రోజుల్లో 129 మంది మృతి... పలువురు గల్లంతు!

ముంబై: మహారాష్ట్రలో గడచిన కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ప్రజలు నానా అవస్థల పాలవుతున్నారు. గత రెండు రోజుల్లో భారీ వర్షాల కారణంగా 129 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో రాయగఢ్, రత్నగిరి, సతారా ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో పలువురు గల్లంతయ్యారని తెలుస్తోంది. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు కృషి చేస్తున్నాయి. 


గత రెండురోజుల్లో పూణే ప్రాంతానికి చెందిన 84,425 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలోగల కొంకణ్, రాయగఢ్, పశ్చిమ మహారాష్ట్రలో గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరంలో 1500 మిల్లీలీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యింది. దీనికితోడు రాష్ట్రంలోని పలు పర్వత ప్రాంతాల్లో కొండ చెరియలు విరిగిపడుతూ, స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Updated Date - 2021-07-24T12:47:20+05:30 IST