లాక్‌డౌన్ సమయంలో జనవాసాల్లో పెరిగిన పాముల సంచారం

ABN , First Publish Date - 2020-04-09T18:36:41+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో జనవాసాల్లో పాముల సంచారం పెరిగింది...

లాక్‌డౌన్ సమయంలో జనవాసాల్లో పెరిగిన పాముల సంచారం

బెంగళూరు (కర్ణాటక): దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ విధించడంతో జనవాసాల్లో పాముల సంచారం పెరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జనం లాక్‌డౌన్ వల్ల ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో జనసంచారం లేకపోవడంతో పుట్టల్లో ఉన్న పాములు సైతం బయట పడి జనవాసాల్లోకి వస్తున్నాయి. బెంగళూరు నగరంలోని ఖాళీ స్థలాలు, పొదల నుంచి పాములు జనవాసాల్లోకి వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బెంగళూరులోని బణాస్ వాడీ ప్రాంతంలో ఓ వాలంటీర్ పామును పట్టుకొని తన వద్ద ఉన్న బాక్సులో పెట్టుకొని వస్తున్నారు. అంతలో పోలీసు కానిస్టేబుల్ అతన్ని ఆపి తనిఖీ చేయగా బాక్సులో పాము కనిపించడంతో షాక్ కు గురయ్యాడు. దీనిపై ఆరా తీయగా లాక్ డౌన్ వల్ల జన సంచారం తగ్గి పాముల సంచారం పెరిగిందని స్నేక్ వాలంటీర్ చెప్పారు.


లాక్‌డౌన్‌కు తోడు వేసవికాలం కావడంతో జనవాసాల్లో పాముల సంచారం పెరిగిందని, దీనిపై ప్రజల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని స్నేక్ క్యాచర్ రాజేష్ కుమార్ చెప్పారు. లాక్ డౌన్ సమయంలోనే పాములకు బ్రీడింగ్ సీజన్ కావడంతో వాటి సంచారం పెరిగిందని దీంతో పాములు జనవాసాల్లోకి తరలివస్తున్నాయి. కెంపపురాలో ఓ ఇంట్లో పూజగదిలో పాము ప్రత్యక్షమైంది. బెంగళూరు సహకార నగర్ లో మారుకారు బానెట్ లో పాము కనిపించింది. యలహంకలో నల్లా గుంతలో పాము చేరింది. పాముల సంచారంపై ఫోన్లు రావడంతో తాము వాటిని పట్టుకొని అడవుల్లో వదిలివేస్తున్నామని స్నేక్ క్యాచర్లు చెబుతున్నారు.

Updated Date - 2020-04-09T18:36:41+05:30 IST