తగ్గిన జనసంచారం

ABN , First Publish Date - 2021-05-17T05:16:45+05:30 IST

జిల్లాలో కర్ఫ్యూ సంపూర్ణంగా, ప్రశాంతంగా సాగింది. ఆదివారం కావడంతో సడలింపు సమయంలో కూడా జనసంచారం అంతగా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార కీలక రంగాలకు సెలవుదినం కావడంతో వాటిని తెరవలేదు. నిత్యావసరాలు, కూరగాయలు ఇతర కొన్నిరకాల వ్యాపారాలు సాగాయి. సాధారణంగా ఆదివారం చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలు అధికంగా ఉండి ఆయా మార్కెట్ల వద్ద రద్దీ ఉంటుంది.

తగ్గిన జనసంచారం
ఒంగోలు నగరంలో పలుచగా ఉన్న జన సంచారం

పలుచోట్ల పెరిగిన తనిఖీలు

కనిగిరిలో సంపూర్ణ లాక్‌డౌన్‌

ఒంగోలు, మే 16  (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కర్ఫ్యూ సంపూర్ణంగా, ప్రశాంతంగా సాగింది. ఆదివారం కావడంతో సడలింపు సమయంలో కూడా జనసంచారం అంతగా లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార కీలక రంగాలకు సెలవుదినం కావడంతో వాటిని తెరవలేదు. నిత్యావసరాలు, కూరగాయలు ఇతర కొన్నిరకాల వ్యాపారాలు సాగాయి. సాధారణంగా ఆదివారం చికెన్‌, మటన్‌, చేపల విక్రయాలు అధికంగా ఉండి ఆయా మార్కెట్ల వద్ద రద్దీ ఉంటుంది. అయితే జిల్లాలోని పలు పట్టణాల్లో ఆదివారం స్థానిక అధికారులు వాటిని మూసేయించారు. దీంతో కొంతమేర రద్దీ తగ్గింది. అద్దంకిలో అధికారులు ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో మాంసం కొట్ల వద్ద రద్దీ ఏర్పడింది. జిల్లాలోని పలుచోట్ల పోలీసులు తనిఖీలు మరింత పెంచారు. ఒంగోలులో ప్రధాన వీధులకు అడ్డంగా బారికేడ్లను కొంతమేర తొలగించి తనిఖీలు, పెట్రోలింగ్‌ పెంచారు. అలాగే మార్కాపురం ఇతర ప్రాంతాల్లోను తనిఖీలు అధికం చేశారు. కనిగిరిలో సంపూర్ణ లాక్‌డౌన్‌ పాటించగా పట్టణం అంతా నిర్మానుష్యంగా మారింది. ఇతర ప్రాంతాల్లోను కర్ఫ్యూ కొనసాగింది. 


Updated Date - 2021-05-17T05:16:45+05:30 IST