న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెదవి విరిచారు. అంతమాత్రాన సరిపోదన్నారు. రైతుల విద్యుత్ ఛార్జీలు తగ్గించి, కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను కొత్త తరహాలో అమలు చేసేంత వరకూ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని అన్నారు. రైతులను ఆకర్షించేందుకే సాగు చట్టాల రద్దు నిర్ణయం చేశారని, ప్రజలేమీ 'ఫూల్స్' కాదని వ్యాఖ్యానించారు. ప్రజలకు అన్నీ తెలుసునని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని లాలూ ఢంకా బజాయంచారు.