కోడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-02-05T18:56:28+05:30 IST

దేశ రక్షణకు సంబంధించిన విషయంలో సైనికులు చూపే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి భారీ ప్రమాదాలను తెచ్చి పెడుతుంది.

కోడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎందుకు అరెస్ట్ చేశారో తెలిస్తే షాక్!

దేశ రక్షణకు సంబంధించిన విషయంలో సైనికులు చూపే చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి భారీ ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. అందుకే సైనికులు ఎప్పుడూ అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అనుమానుతులు ఎలాంటి వారైనా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంటారు. అమెరికాలోని పెంటగాన్ పోలీసులు తాజాగా ఓ కోడిని అదుపులోకి తీసుకున్నారు. పెంటగాన్ సెక్యూరిటీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరగడమే ఆ కోడి చేసిన నేరం. 


సోమవారం తెల్లవారుజామున పెంటగాన్‌లోని యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో ఓ కోడి అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించింది. దాంతో పెంటగాన్ పోలీసులు దానిని అదుపులోకి తీసుకున్నారు. వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌కు చెందిన జంతు సంక్షేమ సంఘం సోషల్ మీడియాలో ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఆ కోడి ఎక్కడ నుంచి పెంటగాన్‌కి వచ్చిందనే విషయాన్ని సంబంధిత అధికారులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు తాము సహాయం చేస్తున్నట్టు జంతు సంక్షేమ సంఘం వెల్లడించింది. 

Updated Date - 2022-02-05T18:56:28+05:30 IST