ఒకేసారి... 73 లక్షల మందికి పెన్షన్...

ABN , First Publish Date - 2022-07-10T22:48:25+05:30 IST

Employees Provident Fund Organisation(EPFO)... ఒకేసారి 73 లక్షల మంది పింఛనుదారులకు pensionను క్రెడిట్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది.

ఒకేసారి... 73 లక్షల మందికి పెన్షన్...

* ఆరు నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్నా... ఉపసంహరణలకు అవకాశం ?

- EPFO కసరత్తు

* 29, 30 తేదీల్లో బోర్డు సమావేశంలో నిర్ణ యం ?

న్యూఢిల్లీ : Employees Provident Fund Organisation(EPFO)... ఒకేసారి 73 లక్షల మంది పింఛనుదారులకు pensionను క్రెడిట్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ నెల(జూలై) 29, 30 తేదీల్లో జరగనున్న బోర్డు  సమావేశంలో... central pension distribution systemను  ఖరారు చేసే ప్రతిపాదనను ఆమోదించే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఓకే అయినపక్షంలో... దేశమంతటా... 73 లక్షలకు పైగా ఉన్న పింఛనుదారుల బ్యాంకు ఖాతాలకు... EPFO ప్రయోజనాలు జమ కానున్నాయి. ప్రస్తుతం... దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పింఛనుదారులకు ప్రతీ నెల వివిధ తేదీల్లో పింఛన్లు జమవుతూ వస్తున్నాయి. అలాకాకుండా... దేశవ్యాప్తంగా ఉన్న పింఛనుదారులందరికీ ఒకేమారు పింఛన్లను జమ చేయాలని EPFO భావిస్తున్నట్లు వినవస్తోంది.


ఈ నెల 29, 30 తేదీల్లో జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై బోర్డు చర్చించనుంది. అంతేకాకుండా... “ఆరు నెలల కంటే తక్కువ కాలం పాటు విరాళాలు అందించిన చందాదారులు పెన్షన్ ఖాతాల నుండి డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించే ప్రతిపాదనను కూడా CBT అదే సమావేశంలో పరిశీలించనున్నట్లు సమాచారం.  ప్రస్తుతం, ఆరు నెలల నుండి 10 సంవత్సరాల వరకు చందా చేసిన వారి పెన్షన్ ఖాతాల నుండి మాత్రమే ఉపసంహరణలకు అవకాశముంది. 

Updated Date - 2022-07-10T22:48:25+05:30 IST