పెన్నమ్మ పరవళ్లు

ABN , First Publish Date - 2022-06-19T05:24:51+05:30 IST

ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నానది పరవళ్లు తొక్కుతోంది.

పెన్నమ్మ పరవళ్లు
చౌళూరు సమీపంలో ప్రవహిస్తున్న పెన్నానది

 హిందూపురం టౌన, జూన 18: ఎగువ ప్రాంతమైన కర్ణాటకలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం సాయంత్రానికి రాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న పెన్నానది ప్రవాహం శనివారం హిందూపురానికి తాకింది. మధ్యాహ్నానికి మరింత వేగంగా నది ప్రవహించింది. ఇదిలా ఉండగా పోచనపల్లి వద్ద ఆరు నెలల క్రితం బ్రిడ్జి దెబ్బతింది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ బ్రిడ్జి ఎక్కడ కూలిపోతుందోనని ప్రజలు భయపడుతున్నారు. 



Updated Date - 2022-06-19T05:24:51+05:30 IST