Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాళోజీ పురస్కారానికి ఎంపికైన పెన్నా శివరామ కృష్ణ

హైదరాబాద్: సాహితీ వేత్త పెన్నా శివరామ కృష్ణను తెలంగాణ ప్రభుత్వం కాళోజీ పురస్కారానికి ఎంపిక చేసింది. కాళోజీ నారాయణరావు జన్మదినమైన సెప్టెంబర్ 9న ఈ అవార్డు కింద రూ.1,01,116/- (ఒక లక్షా వెయ్యి నూట పదహారు రూపాయలు) నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను అందజేస్తారు. సెప్టెంబర్ 9న ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కాళోజీ జయంతి ఉత్సవాలలో పెన్నా శివరామ కృష్ణను సన్మానిస్తారు. పెన్నా శివరామకృష్ణ ప్రముఖ సాహితీవేత్త. నల్గొండ జిల్లాకు చెందిన ఆయన లెక్చరర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన “అలల పడవల మీద”, “నిశబ్దం నా మాతృక” వంటి కవితా సంకలనాలను ప్రచురించారు. గజల్ ప్రక్రియపై ఆయన చేసిన రచనలు ఎంతో ప్రశంసలు పొందాయి. 2015 సంవత్సరం నుంచి కాళోజి పురస్కారాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఒక సాహితీవేత్తకు అవార్డును ఇస్తున్నారు. 

Advertisement
Advertisement