పెంచలకోనలో హైకోర్టు జడ్జి
రాపూరు, మే 24: పెంచలకోనలోని పెంచల నృసింహ స్వామి, ఆదిలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లను మంగళవారం సాయంత్రం హైకోర్టు జడ్జి వీ సుజాత దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ ప్రాశస్త్యం, శ్రీవార్ల విశిష్టతను గురించి వివరించారు. అనంతరం వేదమంత్రాలతో ఆశ్వీరదించి శ్రీవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, తీర్థప్రసాదాలు అందచేశారు.