న్యూఢిల్లీ : పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం డిమాండ్ చేశారు. పెగాసాస్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఉపయోగించిన ఆయుధమని రాహుల్ పేర్కొన్నారు. ఉగ్రవాదులపై ప్రయోగించాల్సిన పెగాసిస్ ఆయుధాన్ని మోదీ ప్రభుత్వం మన దేశంలో ఉపయోగించిందని, దీనిపై దర్యాప్తు చేయాలని, దీనికి కారణమైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ కోరారు.శుక్రవారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. తన స్నేహితులతో మాట్లాడినపుడు సంభాషణలను ట్యాపింగ్ చేశారని రాహుల్ ఆరోపించారు. పెగాసస్ పై న్యాయవిచారణ కోరుతూ కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.