పెద్దాపురంలో మాట్లాడుతున్న ఆర్డీవో వెంకటరమణ
పెద్దాపురం ఆర్డీవో వెంకటరమణ
పెద్దాపురం, జనవరి 17: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (ఓటీఎస్) నిర్దేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్డీవో పసుపులేటి వెంకటరమణ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన సచివాలయ సిబ్బందితో సోమవారం ఓటీఎ్స పథకంపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీఎస్ పథకం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు సచివాలయ సిబ్బంది కీలకపాత్ర పోషించాలన్నారు. అనంతరం గ్రామాలవారీగా రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాస్, ఈవోపీఆర్డీ తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అధికారులు కృషి చేయాలి
సామర్లకోట: మండలంలో ఓటీఎస్ పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా మండల, గ్రామస్థాయి అధికారులు కృషి చేయాలని ఆర్డీవో వెంకటరమణ సూచించారు. సామర్లకోట ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో సుమారు 6వేల లబ్ధిదారులను ఓటీఎ్సలో చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. మండలంలో ఇప్పటివరకూ కేవలం 177మంది మాత్రమే చేరడంతో లక్ష్య సాధనకు చాలా వెనుకబడి ఉన్నామన్నారు. నూరుశాతం లక్ష్యాలను సాధించేందుకు అధికారులు బృందాలుగా ఏర్పడాలని ఆర్డీవో సూచించారు. సమావేశంలో తహశీల్దార్ వజ్రపు జితేంద్ర, ఈవోపీఆర్డీ కెవీ.సూర్యనారాయణ, ఎంఈవో గవ్వా వెంకటేశ్వరరావు, ఆర్డబ్ల్యుఎస్ జేఈ పద్మరూప తదితరులు పాల్గొన్నారు.