‘అవాస్తవాల ప్రచారం సరికాదు’

ABN , First Publish Date - 2022-08-09T06:55:05+05:30 IST

జగ్గంపేటరూరల్‌, ఆగస్టు 8: పోలీసులపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లా ్లడు తూ మండలంలో రామవరానికి చెందిన గండికోట చల్లయ్యమ్మ సరిహద్దుగోడ కూల్చివేసిన విషయమై జూలై 17న స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జక్కె శ్రీనివాసరావు(శ్రీరామ్‌) ఏ-2 నిందితుడిగా పేర్కొన్నామని, మళ్లీ ఇదే

‘అవాస్తవాల ప్రచారం సరికాదు’

జగ్గంపేటరూరల్‌, ఆగస్టు 8: పోలీసులపై అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని పెద్దాపురం డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లా ్లడు తూ మండలంలో రామవరానికి చెందిన గండికోట చల్లయ్యమ్మ సరిహద్దుగోడ కూల్చివేసిన విషయమై జూలై 17న స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. జక్కె శ్రీనివాసరావు(శ్రీరామ్‌) ఏ-2 నిందితుడిగా పేర్కొన్నామని, మళ్లీ ఇదే విషయమై ఆగస్టు 6న గాది శ్రీనివాసరావు అతడి భార్య తమ స్థలం చుట్టూ సిమ్మెంటు దిమ్మలు, ఫినిషింగ్‌ వైర్‌ను జక్కె శ్రీనివా్‌సరావు, అతడి బందువులు తీసిపడవేసినట్టు స్టేషన్‌కు వచ్చి తెలియజేశారన్నారు. దీనిపై విచారణ చేసేందుకు ఎస్‌ఐ, ఏఎ్‌సఐ స్థలం వద్దకు వెళ్లగా శ్రీరామ్‌ అక్కడలేకపోవడంతో కేసు విషయమై ఒక్కసారి స్టేషన్‌కు రావాలని ఫోన్‌లో ఎస్‌ఐ తెలిపారని, అంతేతప్ప అరె్‌స్టలుగాని, దౌర్జన్యాలుగాని చేయలేదని డీఎస్పీ వివరించారు. జక్కె శ్రీనివాసరావు దాక్కున్నాడన్నారు. తన భర్త కనిపించడంలేదని జక్కె సురేఖ ఏ పోలీ్‌సస్టేషన్‌ లో ఫిర్యాదు చేయలేదన్నారు. సమావేశలో సీఐ సూరిఅప్పారావు, ఎస్‌ఐ రఘునాధరావు పాల్గొన్నారు. రామవరంలోని ఘటనాస్థలిని ఇంటిలిజెన్స్‌ ఎస్‌ఐ రేణుకుమార్‌, ఏఎ్‌సఐ రమేష్‌ వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం స్థానిక పోలీ స్‌స్టేషన్‌కు వెళ్లి అధికారుల నుంచి సమాచారం సేకరించారు. 

Updated Date - 2022-08-09T06:55:05+05:30 IST