పెద్దాపురంలో 36 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-04-17T05:51:33+05:30 IST

పెద్దాపురం, ఏప్రిల్‌ 16: పెద్దాపురంలో 36 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదైనట్టు ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.సుదీప్తి తెలిపారు. బ్యాంకు కాలనీ, పాతపెద్దాపు రం తదితర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈనెల 12న సుమారు 70 మందికి వైద్య

పెద్దాపురంలో 36 కరోనా కేసులు
పిఠాపురం కోర్టు హాలులో శానిటైజేషన్‌ నిర్వహిస్తున్న సిబ్బంది

పెద్దాపురం, ఏప్రిల్‌ 16: పెద్దాపురంలో 36 కరోనా పాజి టివ్‌ కేసులు నమోదైనట్టు ఏరియా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.సుదీప్తి తెలిపారు. బ్యాంకు కాలనీ, పాతపెద్దాపు రం తదితర ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈనెల 12న సుమారు 70 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో వారికి సంబంధించి రిపోర్టులు శుక్రవారం వచ్చాయని వారిలో 36 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిదని తెలిపారు. అలాగే పాతపెద్దాపురం ప్రాంతాన్ని ఇప్పటికే కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారన్నారు. కొవిడ్‌ నియంత్రణకు ప్రతీఒక్కరూ భౌతికదూరం పాటించడంతో పాటు మాస్క్‌, శానిటైజర్‌ వినియోగించాలని ఆమె కోరారు.


పిఠాపురం కోర్టులో కరోనా కలకలం

పిఠాపురం, ఏప్రిల్‌ 16: పట్టణంలోని కోర్టుల ప్రాంగణంలో గల అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సిబ్బందిలో ఒకరికి కరోనా సోకడంతో కలకలం రేగింది. ఫలితంగా అన్ని కోర్టుల్లో అత్యవసర కేసులు మినహా మిగిలిన కేసులను వాయిదా వేశారు. కక్షిదారులను పంపివేశారు. న్యాయవాదులు, ఇతర సిబ్బంది అందోళనకు గురయ్యారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో డైరెక్టు కాంటాక్టు ఉన్న వారికి కొవిడ్‌ పరీక్షలు జరిపారు. జిల్లా, సబ్‌ కోర్టులు, రెండు మెజిస్ట్రేట్‌ కోర్టు హాళ్లను మున్సిపల్‌ సిబ్బంది శుక్రవారం సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజేషన్‌ చేశారు. 

Updated Date - 2021-04-17T05:51:33+05:30 IST