శనగ సాగుకు సమయమిదే..

ABN , First Publish Date - 2021-10-19T05:01:03+05:30 IST

శనగ సాగుకు సమయమిదే..

శనగ సాగుకు సమయమిదే..

చేవెళ్ల: చేవెళ్ల డివిజన్‌లో రైతులు యాసంగి పంటగా ఎక్కువగా శనగ సాగుచేస్తారు. మూడు నెలల్లో చేతికొచ్చే పంట. ఎకరానికి 8నుంచి 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో శనగ పంట సాగు గురించి చేవెళ్ల ఏవో కృష్ణమోహన్‌ రైతులకు పలు సూచనలు చేశారు.


  • విత్తే సమయం

అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లోనే విత్తుకోవాలి. తర్వాత విత్తుకుంటే దిగుబడులు తగ్గుతాయి. ఈ పంటకు చౌడు భూములు పనికిరావు.


విత్తన రకాలు

 జేజీ-11 రకం పంట కాలం 100-105 రోజులు, ఎకరానికి 8నుంచి 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుంటుంది. లావుపాటి గింజల దేశీ రకం.


  • అన్నె గిరి

రకం పంట కాంల 100-110 రోజులు. ఎ కరానికి 7-9క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్క గుబురుగా పెరుగుతుంది. గోధుమ వర్ణంలో లావుగా ఉంటుంది.


  • జేఏకేఐ  రకం 9218

ఈ రకం పంటకాలం 95-100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎం డు తెగులును తట్టుకుంటుంది. 


  • లామ్‌ శనగ(ఎల్‌బీఈజీ-7) 

పంట కాలం 90-95 రోజులు. 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ లావుగా ఉంటుంది. కాబూలీ రకం మొక్కఎత్తుగా పెరుగుతుంది.


  • కాంత్రి (ఐసీసీసీ-37)

పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 8-10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గుబురుగా పెరుగుతుంది. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. ఎండు తెగులును తట్టుకుంటుంది. దేశీ రకం.


  • శ్వేత(ఐసీసీవీ-2)

పంటకాలం 80-85 రోజులు. 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. త్వరాగ కాపునకు వస్తుంది. తెగులును తట్టుకునే కాబూలీ రకం. ఆలస్యంగా వేసుకోవడానికి(నవంబర్‌)అనుకూలం.

  • జ్యోతి

పంటకాలం 100-110 రోజులు. 6-7 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గుబురుగా కొమ్మలు వేస్తుంది. గింజ లు గరుకుగా, మధ్యస్థలావుగా ఉంటాయి.

  • విత్తనం

ఎకరాకు 30-40కిలోల విత్తనాలు అవసరం.


  • విత్తన శుద్ధి

ఎండు తెగులున్న చోట కిలో విత్తనాని కి 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడిని వాడాలి. విత్తుకూ విత్తుకు మధ్య 10 నుంచి 30 సెంటీ మీటర్ల దూరంలో విత్తుకోవాలి.


  • ఎరువులు

ఎకరాకు 8కిలోల నత్రజని, 20కిలోల భాస్వరం, 16కిలోల గంధకం ఇచ్చే ఎరువులను విత్తే చివరి దుక్కిలో వేసుకోవాలి.


  • కలుపు నివారణ.. అంతర కృషి

విత్తేముందు పూక్లోరలిన్‌ 45శాతం, ఎకరాకు లీటరు చొప్పున పిచీకారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండివిఽథాలిన్‌ 30శాతం ఎకరానికి 10,105లీటర్లు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసి రోజున గానీ పిచికారి చేయాలి. విత్తిన 20-25రోజలకు గొర్రుతో అంతరకృషి చేయాలి.


  • శనగపచ్చ పురుగు.. సస్యరక్షణ చర్యలు

ఇది లద్దె పురుగు దశలో పూతను, కాయలను తింటుం ది. సీతాకోక చిలక దశలో పూతపైన గుడ్లు పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన పురుగు కాయలను తొలచి గింజలను తింటుంది. లీటరు నీటికి క్వినాల్‌ఫాస్‌ 2.0 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.0గ్రాములు చొప్పున పంట పూత, పిందె దశలో ఉన్న సమయంలో 10రోజుల వ్యవధిలో మం దులు మార్చి రెండు మూడుసార్లు పిచికారీ చేయాలి.


  • రబ్బరు పురుగు...

పైరు తొలి దశలో రబ్బరు(స్పోడోపైరా ఎక్విగ్వా)ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఈ పురుగు మొదటి రెండు ఆకుల మధ్య మొగ్గ దగ్గర ఉండి పత్రహరితాన్ని తింటుం ది. ఎసిఫేట్‌ 1గ్రాము, క్వినాల్‌ఫాస్‌ 21.0మి.లీ లేదా క్లోరిపై రిఫా్‌స2.5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Updated Date - 2021-10-19T05:01:03+05:30 IST