బీర్కూర్, జనవరి 15: మండ లంలోని బైరాపూర్ గ్రామ శివారులోని పంట పొలాల్లో శుక్రవారం నెమలి మృతిచెందింది. పశు, అటవీ శాఖాధికారులకు స్థానికులు సమాచారం అందించారు. పశువైద్య శాఖ సిబ్బంది సంఘటన స్థలంలో పోస్టుమార్టం నిర్వహించారు. పొలాల్లో రసాయన గుళికలు కలిపిన నీటిని తాగడంతోనే నెమలి మృతిచెందినట్లు వారు తెలిపారు. అనంతరం అటవీ శాఖాధికారి గంగాధర్ నెమలిని స్వాధీనం చేసుకున్నారు.