‘జనా’సాగరంలోకి నెమలి..!
ABN , First Publish Date - 2021-06-15T06:02:33+05:30 IST
‘జనా’సాగరంలోకి నెమలి..!
నందిగామ రూరల్, జూన్ 14 : నందిగామ శివారు అనాసాగరం సమీపంలో సోమవారం నెమలి కనిపించింది. పంట పొలాలు, ఇళ్లపై నుంచి తిరుగుతుండటంతో గ్రామస్తులు ఆనందంతో తిలకించారు. ఆహారం, నీరు పెట్టారు. వేటగాళ్ల బారిన పడకముందే అధికారులు స్పందించి నెమలిని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని వారు కోరారు.