Advertisement
Advertisement
Abn logo
Advertisement

వయసు ఇరవై రెండేళ్లు.. బరువు డెబ్బై కేజీలు.. సరైన ఆహారం?

ఆంధ్రజ్యోతి(09-07-2021)

ప్రశ్న: నాకు ఇరవై రెండేళ్లు. ఎత్తు ఐదడుగులు, బరువు డెబ్బైకేజీలు. నాకు పీసీఓడి సమస్య ఉంది. బరువు తగ్గితే గర్భధారణ సులువవుతుంది అని డాక్టర్‌ చెప్పారు. సరైన ఆహారం సూచిస్తారా?


- అశ్విని, అనంతపూర్‌


డాక్టర్ సమాధానం: ఈ సమస్య ఉన్న మహిళల్లో ఆండ్రోజెన్స్‌ అనే హార్మోనులను అధిక మోతాదులో అండాశయాలు ఉత్పత్తి చేస్తాయి. దీని వల్లనెలసరి క్రమం తప్పడం, నెలసరి వచ్చినప్పుడు రక్తం అధికంగా పోవడం, అవాంఛిత రోమాలు రావడం, జుట్టురాలి పోవడంలాంటి లక్షణాలు కనబడతాయి. కొంత మందిలో అండాశయాల్లో నీటితిత్తులు (సిస్ట్స్‌) కూడా ఏర్పడతాయి. ఈ సమస్య వల్ల గర్భధారణ కష్టమవుతుంది, వంధత్వం (ఇన్ఫర్టిలిటి) వచ్చేందుకు కూడా అవకాశం ఉంది. పీసీఓడి ఉన్నవారు సాధారణంగా అధికబరువు సమస్యతో కూడా బాధపడుతుంటారు. ఆహారం, వ్యాయామం విషయాల్లో జాగ్రత్తలతో బరువు తగ్గినప్పుడు ఈ  లక్షణాలు కొంత తగ్గి అదుపులోకి వస్తాయి. ఆహారంలో ముఖ్యంగా రక్తంలో గ్లూకోజును సక్రమంగా నియంత్రించ గలిగే పదార్థాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రొటీన్లు కూడా ముఖ్యం. గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ ఎక్కువగా ఉండే తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు మొదలైనవి అధిక మోతాదులో తీసుకోవాలి. ఆహారంలో కనీసం అరవైశాతం కూరగాయలు, ఆకుకూరలు ఉండాలి. పండ్లు మితంగా తీసుకోవచ్చు. చక్కెర, తీపిపదార్థాలు (బెల్లం, తేనెకూడా), తెల్లబియ్యం, మైదా, ఫాస్ట్‌ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ మొదలైనవి పూర్తిగా మానెయ్యాలి. వ్యాయామాలు చేసేందుకు వీలుకాకపోతే రోజూ కనీసం గంటసేపు ఐదుకిలోమీటర్లు నడవడం వల్ల ఉపయోగం ఉంటుంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement